వైరల్ వీడియో.. ఇంత చిన్న సైకిల్ ను కూడా తొక్కగలరా..!

సైకిల్ అంటే పెద్ద వాళ్ళ నుండి పిల్లల వరకు అందరికి ఇష్టమే.ఇప్పుడు అంటే బైకులు, కార్లు వచ్చాయి.

 Grandpa Likes To Ride World’s Smallest Bike, Grandpa, Cycle Humour, Viral Vide-TeluguStop.com

కానీ పాతకాలం రోజుల్లో సైకిల్ మాత్రమే ప్రధాన వాహనంగా ఉండేది.అప్పట్లో సైకిల్ ఉండే వాడు కూడా గొప్పవాడి తో సమానం.

కానీ రాను రాను టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కారణంగా పక్క సందులో షాప్ కు వెళ్ళడానికి కూడా బైక్ ను మాత్రమే వాడుతున్నారు.

ఇది వరకు చిన్న పిల్లలు సైకిల్ అంటే చాలా ఇష్టంగా తొక్కేవారు.

కానీ ఇప్పుడు చాలా మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి.దీని కారణంగా సైకిల్ పెద్దగా ఎవ్వరు పట్టించు కోవడం లేదు.

ఇప్పటి పిల్లలు సైక్లింగ్ వదిలేసి వీడియో గేమ్స్, మొబైల్స్ తో కాలం గడిపేస్తున్నారు.కానీ సైకిల్ తొక్కడమే ఆనందం మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని మనలో చాలా మందికి తెలుసు.

కానీ తెలిసిన పెద్దగా పట్టించుకోరు.పిల్లలకు చెప్పాల్సిన తల్లిదండ్రులు కూడా మొబైల్ ఇచ్చి వదిలేస్తున్నారు.దీంతో పిల్లలకు ఇండోర్ గేమ్స్ మాత్రమే అలవాటు అవుతున్నాయి.అవుట్ డోర్ గేమ్స్ ఆడడానికి అంతగా ఇష్టపడడం లేదు.

మాములుగా సైకిల్ ఎంత ఉంటుంది.మన కన్నా పెద్దగా ఉంటుంది.

చిన్న పిల్లలకు అయితే వాళ్ళ సైజులో అందుబాటులో ఉంటుంది.

కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వీడియోలో సైకిల్ మన అరచేయి సైజులో ఉంది.కానీ అంత చిన్న సైకిల్ ను కూడా ఒక పెద్ద వయసు ఉన్న వ్యక్తి సునాయాసంగా తొక్కుతున్నాడు.నమ్మబుద్ది కావడం లేదా.

అయితే ఈ వీడియో తప్పకుండ చూడాల్సిందే.ఇందులో ఒక పెద్దాయన అంత చిన్న సైజు సైకిల్ ను తొక్కుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.దీన్ని మీరు కూడా ఒక లుక్ వేయండి.

https://youtu.be/wlEchyAAAa0
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube