బామ్మ కన్నీటి గాథ.. శేఖర్‌ మాస్టర్‌ ఎమోషనల్‌..!

తనతో ఉన్న పది మంది అనాధ పిల్లలను పోషించడం కోసం రోడ్డుపై కర్రసాము చేస్తూ జీవనం కొనసాగించి వృద్ధురాలి కథ ఇది వరకు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.ఆమె చేసిన కర్రసాము చూసి రియల్ హీరో అనిపించుకున్న సోనుసూద్ సహాయం కూడా చేసిన సంగతి తెలిసిందే.

 Shekar Master, Roja, Etv, Small Screen, Kanakamahalakshmi Bumper Draw,roja-TeluguStop.com

తాజాగా ఆ వృద్ధురాలు తెలుగు బుల్లితెర పై మెరిసింది.అది ఎలా అంటారా.? ఈ టీవీ ఛానల్లో ప్రసారం కాబోతున్న శ్రీ కనక మహాలక్ష్మి లక్కీ డ్రా కార్యక్రమంలో ఆవిడ సందడి చేయనుంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

ఈ టీవీ ఛానల్ దీపావళి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని వారి ప్రేక్షకులను అలరించేందుకు ఈవెంట్ ప్లాన్ చేసింది.ఈ కార్యక్రమం సంబంధించి తాజాగా సరికొత్త ప్రోమో ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆలోచించేలా చేస్తోంది.

ఈ కార్యక్రమంలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మరోసారి తమ డాన్స్ తో బుల్లితెర ప్రేక్షకులను అలరించనున్నారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగానే ఆ వృద్ధురాలు అందర్నీ ఆకర్షించే విధంగా స్టేజ్ పై కర్రసాము చేస్తూ కనిపించారు.

కర్రసాము పూర్తయ్యాక ఆవిడ మాట్లాడుతూ.తనకు సోనూసూద్ ఎంతగానో సహాయం చేశారని తన దగ్గర పది మంది పిల్లలు ఉన్నారని వాళ్ళకి నా అనే వారు ఎవరూ లేరని తెలిపింది.

వారందరినీ పోషించే ఆర్థిక స్తొమత తనకు లేకపోవడంతో ఇలా కర్రసాము చేస్తూ వారికి భోజనం అందిస్తున్నట్లు తెలిపింది.తనకి అప్పు ఇవ్వడానికి దుకాణం వారు ఎవరూ ముందుకు వచ్చేవారు కాదని, ఏమైనా సరుకులు అవసరం అయితే డబ్బులు ఇచ్చి సామాన్లు తీసుకెళ్ళు.

అనేవారని తెలిపింది.ఇందుకు సంబంధించి సోనుసూద్ సార్ నాకు ఎంతో సహాయం చేశారని ఆయన తనకు కొడుకుతో సమానం అంటూ బామ్మ తెలిపింది.

ఆ బామ్మ కన్నీటి కథ విని శేఖర్ మాస్టర్ ఒకింత ఎమోషనల్ అయిపోయాడు.ఈ తతంగమంతా మీరు కూడా ఈ ప్రోమోలో చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube