వైర‌ల్‌.. 90ఏండ్ల వ‌య‌సులో కారు న‌డిపేస్తున్న బామ్మ‌..

మ‌న ద‌గ్గ‌ర ఏదైనా నేర్చుకోవాల‌నే త‌ప‌న లేదంటే కృషి ఉండాలే గానీ ఏదైనా స‌రే సాధించ‌గ‌లం.దీనికి వ‌య‌సుతో సంబంధం లేకుండానే అనుకున్న రంగంలో రాణించ వ‌చ్చు.

 Grandmother Driving A Car In Her 90s-TeluguStop.com

ఇప్ప‌టికే ఎంతోమంది ఇలా వృద్ధాప్యంలో కూడా అనేక ప‌నులు చేసి చూపించారు.ఇక ఇప్పుడు ఓ బామ్మ వంతు వ‌చ్చింది.

ఆమె త‌న 90 ఏళ్ల వయసు కూడా చేస్తున్న ప‌ని అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.ఈ వ‌య‌సులో అస‌లు లేవ‌డానికి కూడా ఎవ‌రికీ చేత‌కాదు.

 Grandmother Driving A Car In Her 90s-వైర‌ల్‌.. 90ఏండ్ల వ‌య‌సులో కారు న‌డిపేస్తున్న బామ్మ‌..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ఆమె మాత్రం వ‌య‌సును ప‌క్క‌న పెట్టి ఏకంగా కారు న‌డిపేస్తోంది.

అంద‌రిలాగే ఈ వ‌య‌సులో ఇంట్లో కూర్చోవాల‌ని అనుకోలేదు.

తానేంటూ నిరూపించుకోవాల‌ని త‌లచింది.అనుకున్న‌దే త‌డ‌వుగా కారు డ్రైవింగ్ నేర్చుకుని అందిర‌నీ షాక్‌కు గురి చేసింది.

ఇదే ఒక ఎత్తు అయితే ఇ హైవేల‌పైకి కారుతో వ‌చ్చి రయ్‌మంటూ స్పీడుగా కారును డ్రైవింగ్ చేస్తోంది.కుర్ర‌కారుకు ఏ మాత్రం తీసిపోనంటూ దుమ్ములేపేస్తోంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దేవాస్ జిల్లాలోఓ అద్భుత‌మైన ఘ‌ట‌న జ‌రిగింది.ఈ జిల్లాకు చెందిన రేష్మీ బాయ్ అనే బామ్మ కారు డ్రైవింగ్ మీద ఉన్న ఆసక్తి ఆమెను ఇలా పాపుల‌ర్ చేసేసింది.

చాలా కొద్ది రోజుల్ల‌నే ఆమె కారు న‌డ‌ప‌డం ఎలాగో నేర్చుకుంది.ఇక త‌గ్గేదే లే అన్న‌ట్టు హైవే మీద‌కు కారు డ్రైవింగ్ చేస్తూ వ‌చ్చేసింది.ఇక ఇదంతా కూడా ఆ హైవే మీద వెళ్తున్న కొందరు కెమెరాల్లో రికార్డు చేశారు.ఇందుకు సంబంధించిన వీఆడియోను కొంద‌రు సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా.విప‌రీతంగా వైరల్‌గా మారింది.ఇక బామ్మ డ్రైవింగ్ వీడియోను చూసిన మధ్యప్రదేశ్ సీఎం అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా మెచ్చుకున్నారు.

ఆ బామ్మ ఎంద‌రికో స్ఫూర్తి అంటూ కామెంట్ కూడా చేశారు.

.

#Rashmibhai #Car #Madhya Pradesh #Grandmother

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు