భావోద్వేగంతో ఉప్పొంగిన బామ్మ హృదయం.. 45 ఏళ్లకు మనవడిని చూసి కన్నీళ్లు

పెంచిన ప్రేమను ఖచ్చితంగా ఎవరూ మర్చిపోలేరు.ముఖ్యంగా అమ్మానాన్నలు కాకపోయినా అంతటి అనురాగం కురిపించే ఆయాలు ఉన్నారు.

 Grandma's Heart Filled With Emotion Tears At The Sight Of Her Grandson At 45 Yea-TeluguStop.com

అయితే తమను పెంచిన వారిని అంతా మర్చిపోతున్నారు.కన్న తల్లిదండ్రులనే మర్చిపోయి, వారిని అనాథాశ్రమంలో వదిలేసే రోజులువి.

కన్న ప్రేమను మర్చిపోయి, డబ్బు సంపాదనపైనే అంతా దృష్టిసారిస్తున్నారు.అయితే కొందరు మాత్రం కన్న వారికే కాకుండా పెంచిన వారిని సైతం మర్చిపోవడం లేదు.

తాజాగా అలాంటి అరుదైన దృశ్యం ఇటీవల జరిగింది.ఓ వ్యక్తి నానమ్మగా పిలిచే ఓ ఆయాను 45 ఏళ్ల తర్వాత కలుసుకున్నాడు.

అందులోనూ దేశం దాటి వచ్చి, 8 వేల కిలో మీటర్లు ప్రయాణించి వెళ్లి తన ఆయాను కలిశాడు.ఆ ఇద్దరి కలుసుకున్న భావోద్వేగ వీడియో నెటిజన్లను కదిలిస్తోంది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

స్పెయిన్‌కు చెందిన జువానిటో జాన్సన్ అనే ఓ వ్యక్తిని చిన్నతనంలో అన అనే ఆయా పెంచింది.చాలా ప్రేమగా చూసుకునేది.సొంత బిడ్డలా సాకడంతో జాన్సన్ కూడా ఆమె ప్రేమను మర్చిపోలేదు.

తనను ఎంతో ముద్దు చేయడం అతడికి అంతా బాగా గుర్తుంది.ఆమె లాలించి పెంచిన తీరును పెద్దయ్యాక కూడా జాన్సన్ మార్చిపోలేదు.

అయితే వారు చిన్నతనంలోనే విడిపోయారు.జాన్సన్ బొలీవియా నుంచి స్పెయిన్‌కు వెళ్లిపోయాడు.

వారు విడిపోయి 45 ఏళ్లు అయింది.ఈ తరుణంలో తనను పెంచిన ఆయా ‘అన’ను కలవాలని నిర్ణయించుకున్నాడు.

సుమారు 8 వేల కిలోమీటర్లు ప్రయాణించి, స్పెయిన్‌ నుంచి బొలీవియా చేరుకున్నాడు.ఆ తర్వాత వృద్ధాప్యంలో ఉన్న ఆయా ‘అన’ను కలిసి, తను ఎవరో వివరించాడు.

తనను చిన్నతనంలో ఎంత ప్రేమగా చూసుకుందో గుర్తు చేశాడు.దీంతో అప్పటి చిన్న పిల్ల వాడు ఇంత పెద్దయ్యాక వచ్చాడని ఆయా ‘అన’ గుర్తు పట్టింది.

ఎంతో భావోద్వేగానికి గురైంది.హత్తుకుని తన ప్రేమను తెలియజేసింది.

ఇదంతా కొందరు వీడియో తీశారు.దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

ఈ అరుదైన ఘటన తమను కన్నీరు పెట్టిస్తోందని పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు.పై ఉదాహరణ మాదిరిగానే, ఒక వ్యక్తి 45 సంవత్సరాల తర్వాత తన చిన్ననాటి నానీని కలవడానికి బొలీవియా వరకు ప్రయాణించిన హృదయాన్ని హత్తుకునే వీడియో వైరల్ అయింది.

జువానిటో జాన్సన్ తన నానీని కలవడానికి స్పెయిన్ నుండి వెళ్లి కొన్ని నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో తన విలువైన జ్ఞాపకాన్ని పంచుకున్నాడు.సెప్టెంబర్ 28న ట్విట్టర్ ఖాతా GoodNewsCorres1 ద్వారా మళ్లీ పోస్ట్ చేయబడిన తర్వాత వీడియో వైరల్ అయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube