107 ఏళ్ల వయసులోనూ అద్భుతాలు సృష్టిస్తున్న బామ్మ.. ఇంతకీ ఏం చేస్తుందంటే..?

వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అంటుంటారు కొందరు.మరికొందరు ఏజ్ జస్ట్ ఒక నంబరేనని.

 Grandma Still Works Wonders At The Age Of 107 .. What Else Is She Doing , Viral-TeluguStop.com

ఏ వయసులోనైనా ఏదైనా సాధించవచ్చని చేసి చూపిస్తుంటారు.అలాంటి కోవకు చెందిన వారే కొలెట్ట్‌ మేజ్‌.

ఫ్రాన్స్‌కు చెందిన ఈమె వయస్సు 107 ఏళ్లు! సెంచరీ దాటినా.ఆమెలో ఉరికే ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు.

ఈమె కుర్రకారుకి పోటీగా పియానోపై రాగాల్ని అలవోకగా పలికిస్తూ.ఔరా అనిపిస్తుంది.

తాజాగా మరో కొత్త ఆల్బమ్ ను విడుదల చేసి సంచలనం సృష్టిస్తోంది.ఆమె తన 70ఏళ్ల కొడుకు సాయంతో విడుదల చేయించిన ఆల్బమ్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఆమె మొదటిసారిగా 84 ఏళ్ల వయసులో తొలి ఆల్బమ్ విడుదల చేసింది.ఆ తర్వాత మరో అయిదు ఆల్బమ్ లను విడుదల చేసి అద్భుతాలు సృష్టించింది.

1914 జూన్‌ 16న ఫ్రాన్స్ లో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కొలెట్ట్‌ మేజ్ చిరు ప్రాయం నుంచే చాలా యాక్టీవ్ గా ఉండేది.నాలుగేళ్లకే పియానో వాయించాలని బాగా తపన పడేది.

ఆవిధంగా చిన్నతనం నుంచే ఆమె పియానో వాయించటంలో పేరుగాంచింది.మ్యూజిక్‌ కోర్సులో చేరతానని ఆ చిన్న వయసులోనే చెప్పడంతో తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారు.ఏదో తెలీక అలా అడుగుతుంది ఏమో అనుకున్నారు కానీ ఆమె పట్టు వదలకుండా పియానో నేర్చుకుని ఆశ్చర్యపరిచింది.15 ఏళ్లకే పియానో వాయించడంలో నైపుణ్యం సాధించిన ఈమె 16 ఏళ్లకే ఓ మ్యూజిక్‌ స్కూలులో పియానో టీచర్‌గా చేరి తల్లిదండ్రులకు తానేంటో నిరూపించింది.

Telugu Age, Album, Album Yaeasrs, Kolete Megge, Maerica, Middle Cast-Latest News

అయితే గత పదిహేనేళ్లుగా ప్రతిరోజూ ఎనిమిది గంటలపాటు పియానో వాయిస్తూ.వాటిని రికార్డు చేస్తోంది.ఆ రికార్డింగులను సౌండ్‌ ఇంజినీర్‌ సాయంతో ఆల్బమ్‌లుగా మార్చి కొడుకుచే విడుదల చేయిస్తుంది.చిన్నతనం నుంచే సంగీతంపై ఎంతో ఇష్టం పెంచుకున్న ఈమె తన ఆరోగ్య రహస్యం సంగీతం వాయించడం, వినడం అని చెబుతోంది.

సంగీతం అనేది భావోద్వేగాలతో కూడుకున్నదని ఆమె వివరిస్తోంది.తాజాగా ఆల్బమ్ విడుదల చేసిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.ప్రకృతి, ప్రేమ, కలలు, ఆశలు వంటి వాటన్నింటికీ సంగీతమే ఆత్మీయ ఆహారంగా నిలుస్తుందని చెప్పారు.అందుకే తనకు మ్యూజిక్ కంపోజ్ చేయడం అంటే చాలా ఇష్టం అని అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube