సంకల్పం ఉంటే వయసుతో సంబంధం లేకుండా ఎంత పెద్ద పనైనా చేయవచ్చు.ఈ విషయాన్ని ఎందరో వృద్ధులు చేసి చూపించారు.
కాగా తాజాగా ఒక 70 ఏళ్ల వృద్ధురాలు తన సామర్థ్యానికి మించి సాహసం చేసింది.ఒక రైలును భారీ ప్రమాదం( major train mishap ) నుంచి కాపాడింది.
అందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమెను ప్రశంసించింది.ఈ వృద్ధురాలు తన శరీరం సహకరించకపోయినా పరిగెత్తుకుంటూ వెళ్లి రైల్వే ట్రాక్‌పై( railway track ) భారీ వృక్షం పడిందని తెలియజేసింది.
రైలు అటువైపుగా వస్తుండగా అది చెట్టు వల్ల పట్టాలు తప్పి కింద పడే ప్రమాదం ఉందని ఈమె ముందుగానే గ్రహించింది.అందుకే తన ఇంట్లో ఉన్న ఎర్రగుడ్డ పట్టుకొని రైల్వే పట్టాలపై పరిగెత్తుకుంటూ వార్నింగ్ సైన్ ఇచ్చింది.
దీంతో అప్రమత్తమైన లోకో పైలట్( Loco Pilot) వెంటనే ట్రైన్ ఆపేశాడు.దాంతో పెను ప్రమాదం తప్పింది.
లేదంటే వందల సంఖ్యలో ప్రజలు చనిపోయి ఉండేవారు.
మార్చి 21న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.ఇక ట్రైన్ ప్రయాణికులకు ప్రాణదాత అయిన ఆ వృద్ధురాలి పేరు చంద్రావతి( Chandravati ).ఆమె సొంత ఊరు కర్ణాటక రాష్ట్రం, మంగళూరు సిటీ సమీపంలోని కుడుపు ఆర్య.ఆమె కాపాడిన ట్రైన్ మత్సగంధ ఎక్స్‌ప్రెస్.ఇది మంగళూరు నుంచి ముంబైకి వెళ్తోంది.ఇది ప్రయాణిస్తున్న పట్టాలపై పెద్ద వృక్షం పడిపోగా.చంద్రావతి రెడ్ కలర్ గుడ్డ ఊపుతూ రైలుకు ఎదురుగా పరిగెత్తింది.
దాంతో వెంటనే బ్రేక్ వేయగా ఆ రైలు సరిగ్గా ఆ పెద్ద వృక్షానికి ముందు వచ్చి ఆగింది.
వృక్షం కూలిపోతున్న సమయంలో చంద్రావతి భోజనం చేస్తోంది.ఇల్లు పక్కనే ఉండటంతో చెట్టు కూలిన శబ్దం ఆమెకు వినిపించింది.ఏంటా అని వెంటనే ఆమె బయటికి వెళ్లి చూసింది.
అప్పుడే రైలు పట్టాలపై అడ్డంగా వృక్షం పడిపోయి ఉండటం కనిపించింది.మరోవైపు అదే పట్టాలపై ట్రైన్ వస్తోందని ఆమె గమనించింది.
తర్వాత తన వృద్ధ వయసును లెక్కచేయకుండా ఆమె అందరి ప్రాణాలను కాపాడింది.ఆమె సాహసాన్ని మెచ్చుకున్న లోకో పైలట్ ఆమె గురించి ఉన్నతాధికారులకు తెలియజేశారు.
అందుకు సంతోషించిన మంగళూరు రైల్వే పోలీసులు ఆమెకు సన్మానం చేశారు.ఈ ఘటన గురించి తెలిసిన వారందరూ ఆ బామ్మను బాగా పొగిడేస్తున్నారు.