గత దశాబ్ధ కాలంగా మన జీవన శైలిలో అనేక రకాల మార్పులు చోటు చేసుకున్నాయి.పెరిగిన జీవన వేగంతో పాటు కాలుష్యం కారణంగా .
లెక్కకు మించిన అంతుబట్టని అనారోగ్యాలతో సగటు మనిషి సతమతమవుతున్నాడు.ఆదాయాలు పెరిగినంతగా మనిషి జీవన ప్రమాణాలు పెరగటం లేదు.
లెక్కకు మించిన వైద్య విధానాలు ఉన్నప్పటికీ చెప్పుకోదగ్గ ఫలితాలు కనిపించటం లేదు.దీంతో చాలా మంది ఆరోగ్యంపై ఎక్కువగా కాన్సెన్ ట్రెషన్ చేస్తుంటారు.
సరైన సమయంలో తినడంతో పాటు.శరీరానికి మంచి ఆకారం కోసం జిమ్ కు వెళ్లి మరీ కసరత్తులు చేస్తుంటారు.
ఒక్కోసారి మంచి వయసులో ఉన్నవారే వ్యాయామం చేయాలంటే బద్దకిస్తున్నారు.కానీ ఓ 80 ఏళ్ల బామ్మ మాత్రం తన మనవడితో కలిసి జిమ్ చేస్తుంది.
ఆ వయసులో ఉన్న వారు మంచానికే పరిమివైతమై కృష్ణా రామా అనుకుంటూ ఇంట్లో ఉంటారు.కొందరైతే చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేక తెగ ఇబ్బంది పడుతుంటారు.
మనవళ్లు, మానవరాళ్లతో కాలక్షేపం చేస్తూ జీవితాన్ని గడిపేస్తుంటారు.కాగా, ఈ బామ్మ చేస్తున్న జిమ్ వీడియో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.ఒక బామ్మ తన మనవడు జిమ్ చేస్తుండగా టెర్రస్ మీదకు వెళ్లింది.
ఆమెకు 82 ఏళ్లు.తన మనవడు ఆమెకు సవాల్ విసిరాడో.మరేంటో కానీ.80 కేజీల డంబెల్ ను ఎత్తింది.ఏ మాత్రం ఒత్తిడి లేకుండా డంబెల్ ను పైకి ఎత్తి ఆ తర్వాత మెల్లగా కింద పెట్టింది.బామ్మ వర్కవుట్స్ చూసి మనవడు షాక్ కు గురయ్యాడు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.దీన్ని చూసిన నెటిజన్లు.వావ్… బామ్మ.భలే వర్కవుట్స్ చేస్తుందంటూ కామెంట్ లు పెడుతున్నారు.
మాకు నంబర్లు మాత్రమే పెరిగాయి.మేమింకా ఎంతో యవ్వనంగా ఉన్నట్టు ఫీలవుతున్నాం” అని చెబుతున్నారు ఈ పెద్దోళ్లు.
ఈ వీడియో చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు.