బామ్మ డ్యాన్స్ అదుర్స్.. యూత్‌కు స‌వాల్ విసురుతోందిగా..

డ్యాన్స్ అంటే ఒక క‌ల‌.అన్నీ మ‌ర్చిపోయి శ‌రీరాన్ని పాట‌కు త‌గ్గ‌ట్టు క‌దిపితే వ‌చ్చే ఆనందం అంతా ఇంతా కాదు.

 Grandma Dance In Marrege As If Throwing A Challenge To The Youth Grandma Dance, Viral Video, Viarl , Viral In Internet, Marrege, Viral-TeluguStop.com

దాని ముందు ఎన్ని ల‌క్ష‌లు పెట్టినా వేస్టే అనిపిస్తుంది.బాధ‌లు, క‌ష్టాలు మైమ‌రిచిపోయి వేసే డ్యాన్స్ మ‌న‌సును ఉల్లాసంగా మారుస్తుంది.

అందుకే దానికి అంత క్రేజ్ ఉంటుంది.అయితే డ్యాన్స్‌కు ఎన్నో ర‌కాల పేర్లు ఉన్నాయి.

 Grandma Dance In Marrege As If Throwing A Challenge To The Youth Grandma Dance, Viral Video, Viarl , Viral In Internet, Marrege, Viral-బామ్మ డ్యాన్స్ అదుర్స్.. యూత్‌కు స‌వాల్ విసురుతోందిగా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలా చేయాలి, అలా చేయాలి అనే రూల్స్ ఏ మాత్రం పెట్టుకోకుండా ఎవ‌రికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు వారు చేస్తుంటారు.త‌మ ఫీల్‌కు త‌గ్గ‌ట్టు ఆడేస్తుంటారు.

అయితే ఈ మ‌ధ్య పెండ్లిలో జ‌రుగుతున్న డ్యాన్స్ వీడియోలు ఎంత‌లా వైర‌ల్ అవుతున్నాయో తెలిసిందే.

పెండ్లి అంటేనే సంబురంగా జ‌రిగే పండుగ‌.

ప్ర‌తి వ్య‌క్తి జీవితంలో ఒకేసారి వ‌చ్చే వేడుక కాబ‌ట్టే దీన్ని అంతా క‌లిసి వైభ‌వంగా నిర్వ‌హిస్తుంటారు.అయితే ఈ పెండ్లి వేడుక‌ల్లో ఈ మ‌ధ్య డ్యాన్స్ వీడియోల‌కు బాగా ఆద‌ర‌ణ వ‌స్తోంది.

పెండ్లి కూతురు చేస్తున్న డ్యాన్స్‌కు అయితే ల‌క్ష‌ల్లోనే వ్యూస్ వ‌స్తున్నాయి.ఇక పెండ్లికి వ‌చ్చిన వారిలో కూడా కొంద‌రు అందంగా చేస్తున్న డ్యాన్స్ వీడియోలు కూడా అనేకం ఉన్నాయి.

అయితే యూత్ మాత్ర‌మే ఈ పెండ్లి వేడుక‌ల్లో ఇప్పుడు ఓ బామ్మ డ్యాన్స్ చేయ‌డం అంద‌రినీ షాక్ కు గురి చేస్తోంది.ఆమె డ్యాన్స్ చూసిన వారంతా వావ్ అంటున్నారు.

ఓ పెండ్లి వేడ‌క‌కు వ‌చ్చిన బామ్మ అంద‌రిలా సైలెంట్ గా ఊరుకోకుండా త‌న లోని ట్యాలెంట్‌ను బ‌య‌ట పెట్టేసింది.ఈ వీడియోలో వధూవరులు సైలెంట్‌గా ఉంటే చూడ‌లేక‌పోయిందో ఏమోగానీ ఏకంగా తానే రంగంలోకి దిగిపోయింది.యూత్ సైలెంట్ గా ఉంటే ఆమె వారికి స‌వాల్ విసురుతున్న‌ట్టు డ్యాన్స్ చేసేసింది.చీర‌క‌ట్టులోనే అదిరిపోయే స్టెప్పుల‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంది.భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్ సాంగ్‌కు ఆమె కాలు క‌దిపింది.ఇక దీన్ని నెట్టింట్లో వ‌ద‌లగా విప‌రీతంగా వైర‌ల్ అయిపోతుంది.

ఆమె డ్యాన్స్ చూసిన వారంతా కామెంట్ల‌తో ప్ర‌శంసిస్తున్నారు.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube