Manoj ,Mounika : తిరుపతికి చేరుకున్న మనోజ్ దంపతులకు ఘన స్వాగతం.. వీడియో వైరల్?

టాలీవుడ్ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో మంచు మనోజ్( Manchu Manoj ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మోహన్ బాబు తనయుడుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ తెలుగులో నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.

 Grand Welcome Manoj Mounika Couples Sri Vidyanikethan College-TeluguStop.com

ఇది ఇలా ఉంటే ఇటీవలే మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.గత కొంతకాలంగా వీరి పెళ్లికి సంబంధించిన అనేక రకాల వార్తలు వినిపిస్తుండగా తాజాగా అదే వార్తలను నిజం చేస్తూ ఈ జంట ఒకటి అయ్యారు.

మౌనిక రెడ్డి( Mounika Reddy ) మాజీ మంత్రి భూమా అఖిలప్రియ( Bhuma Akhilapriya ) చెల్లెలు అన్న విషయం మనందరికీ తెలిసిందే.ఇక ఆ మౌనిక రెడ్డి, మంచు మనోజ్ ల వివాహం మంచు లక్ష్మి ఇంట్లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే పెళ్లి తర్వాత ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూనే ఉన్నారు మనోజ్ దంపతులు.ఈ నేపథ్యంలోనే తాజాగా మంచు మోహన్ బాబు( Manchu Mohan Babu ) పుట్టినరోజు సందర్భంగా ఫ్యామిలీతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.

అంతేకాకుండా మనోజ్ దంపతులు సతి సమేతంగా తిరుపతి జిల్లా రంగంపేట లోని శ్రీ విద్యానికేతన్ కీ చేరుకున్నారు.పెళ్లయిన తర్వాత మొదటిసారి జంటగా అక్కడికి వెళ్లడంతో విద్యార్థులు మనోజ్ కి భూమా మౌనిక రెడ్డికి ఘన స్వాగతం పలికారు.

చుట్టూ విద్యార్థులు చేరే గట్టిగట్టిగా అరుస్తూ షేక్ హాండ్ ఇస్తూ సెల్ఫీలు దిగుతూ రచ్చ రచ్చ చేశారు.మనోజ్ కూడా వారితో కలిసి సెల్ఫీలు దిగాడు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అందుకు సంబంధించిన వీడియో ని మంచు మనోజ్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మంచు అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube