'ఆర్ఆర్ఆర్' కోసం జక్కన్న భారీ స్కెచ్..మొదటిసారి అలా..!

Grand Pre Release Event Of Rrr In Dubai

టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఆర్ఆర్ఆర్.టాలీవుడ్ స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

 Grand Pre Release Event Of Rrr In Dubai-TeluguStop.com

రాజమౌళి ఈ సినిమాను కొమరం భీం, అల్లూరి సీతారామరాజు వంటి స్వాతంత్ర్య సమర యోధుల పాత్రలతో ఒక కల్పిత కథతో ఈ సినిమాను తెరకెక్కించాడు.

Telugu Dubai, Grand Pre Release Event Of Rrr In Dubai, Ntr, Pre Release Event, Rajamouli, Ram Charan, Rrr, Rrr Promotions-Movie

ఈ సినిమా కోసం ప్రేక్షకులు అందరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.రాజమౌళి ఈ కథను తెరపై ఎంత అద్భుతంగా చూపించాడో అని అందరిలో ఒక ఆసక్తి ఉంది.మరి ప్రేక్షకులను త్రిల్ చేయడానికి రాజమౌళి ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 7న మన ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

 Grand Pre Release Event Of Rrr In Dubai-ఆర్ఆర్ఆర్’ కోసం జక్కన్న భారీ స్కెచ్..మొదటిసారి అలా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా ప్రమోషన్స్ కూడా భారీ రేంజ్ లోనే ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నాడని తెలుస్తుంది.రాజమౌళి ఎప్పుడు ఏ విషయంలో అయినా ప్రత్యేకంగా ఆలోచిస్తారు అనే విషయం తెలిసిందే.ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ కూడా తెలుగు సినిమా స్థాయిని పెంచే విధంగా చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేసాడట.

Telugu Dubai, Grand Pre Release Event Of Rrr In Dubai, Ntr, Pre Release Event, Rajamouli, Ram Charan, Rrr, Rrr Promotions-Movie

మన తెలుగు సినీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ‘ఆర్ఆర్ఆర్‘ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను దుబాయ్ లో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఒక్కటే ఆలస్యం.సౌత్ సినిమాల్లో రోబో 2.0 సినిమాకు మాత్రమే దుబాయ్ లో ప్రమోషన్స్ చేసారు.ఇక మన తెలుసు సినిమాల్లో అయితే ఇదే తొలిసారి.

రాజమౌళి బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీని అగ్ర స్థానంలో నిలబెట్టాడు.ఇక ఇప్పుడు ఈ సినిమాతో మరొక సంచలనం సృష్టించే దిశగా వెళ్తున్నట్టు తెలుస్తుంది.

చూడాలి మరి ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ ఖ్యాతిని ఏ స్థాయిలో పెంచుతుందో.

#RRR #Rajamouli #Dubai #Pre #Ram Charan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube