గ్రాండ్‌గా జగన్ పుట్టిన రోజు వేడుకలు.. ఆ నేతలకు మాత్రం ‘రిటర్న్ గిఫ్ట్’ కావాలంట..?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కలిసి హ్యాపీగా జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది ఆయన పుట్టిన రోజు.ఆ తర్వాత క్రిస్మస్ పండుగ తండ్రి బర్త్ డే రోజున ఆయన కూతుర్లు ఎక్కడున్న ఇంటికి వచ్చేస్తారు.

 Grand Jagan's Birthday Celebrations . Do Those Leaders Want A 'return Gift' ..?,-TeluguStop.com

తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతి అందరూ కలిసి సంతోషంగా జగన్ బర్త్ డే వేడుకలు జరుపుకుంటారట.ప్రస్తుతం జగన్ ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి.

ఈ సారి వేడుకలు కూడా అదిరిపోవాలని వైసీపీ లీడర్లు గ్రాండ్‌గా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

డిసెంబర్ 21 జగన్ పుట్టిన రోజు నేటితో ఆయన 50వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు.

ఈ క్రమంలోనే జగన్ పుట్టిన రోజు వేడుక‌ల‌ను ఘ‌నంగా జరపాలని వైసీపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.అయితే, కొందరు నాయకులు ముఖ్యమంత్రి జగన్ కోసం అదిరిపోయే బహుమతులు ఇచ్చేందుకు రెడీ అయ్యారని సమాచారం.

ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారట.

Telugu Ap Otics, Jagan, Jagan Day, Vijayamma, Ys Bharathi-Telugu Political News

జ‌గ‌న్ బర్త్ డే వేడుకలను వైభ‌వంగా నిర్వహించి ఆయ‌న దృష్టిలో పడాలని చూస్తున్నారట.కోటికి పైనే విలువ చేసే వస్తువులను జగన్‌కు బహుమతి కింద ఇచ్చి రిటర్న్ గిఫ్ట్ కూడా కొట్టేయాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.త్వరలో సీఎం కేబినెట్ విస్తరిస్తారని ఏపీలో జోరుగా చర్చ నడుస్తోంది.

అయితే, జగన్ బర్త్ డే కు మంచి బహుమతి ఇచ్చి ఫలితంగా మంత్రి పదవి కొట్టేయాలని కొందరు కీలక నేతలు భావిస్తున్నారట.అందులో మహిళా నేతలు కూడా ఉన్నట్టు సమాచారం.

గుంటూరు నుంచి మహిళా నేతతో పాటు, విశాఖ తూర్పు నాయకుడు, మరికొందరు యువ నేతలు కూడా మంత్రి పదవి కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.చూద్దాం మరి జగన్ ఆశీస్సులు ఎవరికి లభిస్తాయో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube