కోతికి ఘ‌నంగా అంతిమ సంస్కారాలు.. ఎక్కడంటే..?

మనదేశంలో ఆచారాలు, సంప్రదాయాలు చాలా విచిత్రంగా ఉంటాయి.ఇవి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి.

 Grand Funeral For The Monkey In Madhya Pradesh Rajgadh Details, Monkey, Viral Ne-TeluguStop.com

అందుకే భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం అంటారు.ప్రకృతి ప్రసాదితాలైన పర్వతాలు, రాళ్లు, చెట్లు, పుట్టలు, జంతువులను దైవ సమానంగా పూజిస్తారు.

ఇలాంటి కోవకు చెందిన ఓ ఘటన మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘడ్ చోటు చేసుకుంది.అక్కడ ఇటీవల ఓ కోతి చనిపోయింది.

సాధారణంగా కోతి చనిపోతే కొన్ని ప్రాంతాల్లో అసలు పట్టించుకోరు.కానీ, అక్కడి ప్రజలు మాత్రం చనిపోయిన కోతిని దైవ సమానంగా భావించే భారీ ఊరేగింపుతో దహన సంస్కారాలు చేశారు.

వివరాలు ఇలా ఉన్నాయి.డిసెంబర్ 29న ఓ కోతి అడవి నుంచి దలుపురా గ్రామంలోకి వచ్చింది.

సాయంత్రం వరకు చెట్లు, ఇళ్లపై తిరుగుతూ ఉంది.అయితే రాత్రికి ఓ ఇంటి ముందు నిలబడి చలికి వణికి పోయింది.

దీంతో అక్కడి వారు దానికి వస్త్రాలు కప్పి చలి మంట వేశారు.అయినా కోతి చలికి వణికి పోతుంది.

దీంతో వెంటనే ఖల్చీపూర్‌కు తీసుకెళ్లి వైద్యుడికి చూపించారు.చికిత్స అనంతరం గ్రామస్తులు కోతిని తిరిగి గ్రామానికి తీసుకువచ్చారు.

అయితే అదే రోజే కోతి అనారోగ్యంతో చనిపోయింది.

Telugu Grand Funeral, Madhya Pradesh, Monkey, Monkey Rituals, Monkey Funeral, Ra

మరుసటి రోజు గ్రామస్తులంతా హనుమాన్ ఆలయానికి చేరుకున్నారు.కోతిని అలంకరించి అందరూ టెంకాయలు కొట్టి దండం పెట్టుకున్నారు.వేలాదిగా తరలివచ్చిన ప్రజలు కీర్తనలు పాడుతూ కోతి అంతిమ యాత్రలో పాల్గొన్నారు.

అంత్యక్రియలు అనంతరం కొన్ని రోజులకు విందును దలుపురా గ్రామంలో ఏర్పాటు చేశారు.ఈ విందుకు దాదాపు 50 కిలోమీటర్ల పరిధి గ్రామాల ప్రజలు హాజరయ్యారు.5వేల మందికిపైగా విందులో పాల్గొన్నారు.కోతి మృతికి సంతాపంగా అక్కడి వారు విరాళాలు సేకరించి ఈ విందు ఏర్పాటు చేశారు.

ఇందు కోసం ఏకంగా కార్డులను సైతం ముద్రించారు. ఇక ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube