ఘనంగా రాజా బహదూర్ వెంకట రామారెడ్డి జన్మదిన వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట "రేప" రెడ్డీస్ ఎంప్లాయిస్ & ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజా బహదూర్ కోత్వాల్ వెంకట రామారెడ్డి 155 జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఎల్లారెడ్డిపేట మండలంలోని రెడ్డి విద్యార్థిని విద్యార్థులకు పదవ తరగతిలో 10/10 జీపీఎ, ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులకు, వ్యవసాయ రంగంలో ప్రతిభ కనబరిచిన వారికి ఘనంగా సన్మానించి, మెమెంటో నగదుతో సత్కరించారు.

ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన నాయిని విశ్వక్ రెడ్డి, గన్న సాత్విక రెడ్డి,రేష్మితా రెడ్డి, ఇల్లందుల రిషిక,కొండే సురేందర్ రెడ్డి,వంగ నరసింహారెడ్డి,శివారెడ్డి,ఎర్ర భాస్కర్ రెడ్డి, అక్కపళ్లి కి చెందిన కీర్తనకు 500 రూపాయల పారితోషికం అందించారు.రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి అన్ని పంటలకు బోనసస్ వేయాలని ఈ సందర్భంగా తెలిపారు.

రేపా కన్వీనర్ మోతే దేవా రెడ్డి,కో కన్వీనర్ ముత్యాల వెంకటరెడ్డి,ముత్యాల శ్రీనివాస్ రెడ్డి,యమగోండ బాల్ రెడ్డి, ముత్యాల ప్రభాకర్ రెడ్డి,కోల బాపురెడ్డి,నాయిని భాస్కర్ రె,డ్డి తాడ ప్రభాకర్ రెడ్డి,అమరేందర్ రెడ్డి, గుండాడి వెంకటరెడ్డి,నేవూరి రవీందర్ రెడ్డి,పారిపెల్లి రామిరెడ్డి,వంగ గిరిధర్ రెడ్డి,ముత్యాల శేఖర్ రెడ్డి,యమకొండ కిష్టారెడ్డి, మల్లారపు అమరేందర్ రెడ్డి, కొండే రాంరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాజ బహదూర్ వెంకటరామిరెడ్డి విగ్రహాన్ని ఎల్లారెడ్డిపేట బస్టాండ్ ప్రాంతంలో పెట్టడానికి గత పాలకవర్గం తీర్మానం చేసి కాఫీని కూడా అందజేశారని, త్వరలో ఎల్లారెడ్డిపేట రెడ్డి కుటుంబ సభ్యుల సహకారంతో విగ్రహాన్ని నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.

రాజా బహదూర్ వెంకట్రామా రెడ్డి గొప్ప సంఘ సేవకులు, విద్యా దాతలు.మనిషికి చదువు అవసరం అని నమ్మినవారు,అందుకె ఎన్నో బడులకు, కళాశాలలకు, వసతి గృహాలకు డబ్బును దానం చేశారని పేర్కొన్నారు.

Advertisement

పల్లెటూర్ల నుండి హైదరాబాద్ రావడమే కష్టమైనటువంటి రోజుల్లొ ఆబిడ్స్, నారాయణగూడ లాంటి ప్రదానమైన ప్రాంతాల్లో విద్యా సంస్థలను, వసతి గృహాలను నిర్మించారు.కుల మతాలకు అతీతంగా విద్యార్థులకు రెడ్డి హాస్టళ్ళలో ఆశ్రయం కల్గించిన గొప్ప వ్యక్తి అని అన్నారు.

బంగారు చీర..సిరిసిల్ల చేనేత కళాకారుడి అద్భుత ఆవిష్కరణ
Advertisement

Latest Rajanna Sircilla News