భారతీయ సంగీత కళాకారుడికి మూడోసారి గ్రామీ అవార్డు... దేశానికి అంకితమిచ్చిన వైనం!

భారతీయ మ్యూజిక్ కంపోజర్ రిక్కీ కేజ్ గురించి ప్రత్యేకంగా ఇక్కడ పరిచయం చేయాల్సిన పనిలేదు.ఆయన తాజాగా 64వ గ్రామీ అవార్డు వేడుకలో మరోమారు సత్తా చాటారు.ఇప్పటికే 2 గ్రామీ అవార్డులను సొంతం చేసుకున్న ఆయన, తాజాగా మరో అవార్డును దక్కించుకోవడం విశేషం.2022 బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ కేటగిరీలో రాక్, రోల్ లెజెండ్ స్టీవర్ట్ కోప్‌ ల్యాండ్‌తో కలిసి రూపొందించిన ‘డివైన్ టైడ్స్’ ఆల్బమ్ కు ఈ అవార్డు దక్కడం గమనార్హం.అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌ లో జరిగిన అవార్డుల ప్రదానోత్సం వారు ఈ అవార్డును తాజాగా అందుకోవడం జరిగింది.ఇప్పటికే ఈ ఆల్బమ్ రోలింగ్ స్టోన్, బ్లూమ్‌ బెర్గ్, ది సండే గార్డియన్ సహా పలు వార్తల సంస్థలతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది.

 Grammy Award For The Third Time For An Indian Music Artist... Vaynam Dedicated T-TeluguStop.com

ఇక రిక్కీ కేజ్ గతంలోకి తొంగి చూస్తే, బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ కేటగిరీ కింద 2 గ్రామీ అవార్డులు సొంతం చేసుకున్నారు.2015లో తన ఆల్బమ్ ‘విండ్స్ ఆఫ్ సంసార’కు, 2022లోనూ ‘డివైన్ టైడ్స్’ గాను గ్రామీ అవార్డులను దక్కించుకున్నాడు.బెంగుళూరుకు చెందిన రిక్కీ కేజ్-లెజెండ్ స్టీవర్ట్ కోప్‌ల్యాండ్ కలిసి ఈ ఆల్బమ్ ను రూపొందించారు.ముచ్చటగా మూడోసారి ఈ అవార్డును అందుకోవడం పట్ల రిక్కీ మిక్కిలి ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో రాసుకొస్తూ… “ఇప్పుడే నా 3వ గ్రామీ అవార్డును అందుకున్నాను.చాలా ధన్యాదాలు.నేనేమీ మాట్లాడలేకపోతున్నాను.ఈ అవార్డును భారతదేశానికి అంకితం చేస్తున్నాను” అంటూ పోస్ట్ షేర్ చేసారు.

కాగా ‘డివైన్ టైడ్స్‌’లో తొమ్మిది పాటలు వీక్షకులను ఎంతో అద్భుతంగా ఆకట్టుకోవడం జరిగింది.ప్రపంచ వ్యాప్తంగా తనకున్న పరిచయస్తులు తీసిన వీడియోలతో ఈ పాటలను రూపొందించినట్లు రిక్కీ చెప్పడం కొసమెరుపు.ఇక ఈ సందర్బంగా ఓ మీడియా వేదికగా ఆయన మాట్లాడుతూ….“3వ గ్రామీ అవార్డుకు నామినేట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది.డివైన్ టైడ్స్ ఆల్బమ్ అనేది నా అత్యంత సృజనాత్మకమైన, విజయవంతమైన ఆల్బమ్స్ లో ఒకటి.దానికి వస్తున్న ప్రశంసలు నన్ను ఆనందంలో ముంచెత్తుతున్నాయి.స్టీవర్ట్ కోప్‌ ల్యాండ్, నేను కలిసి ‘డివైన్ టైడ్స్‌’ని రూపొందించాం.మా సంగీతం ద్వారా ప్రేక్షకులను అందమైన ప్రదేశాలకు, అంతకు మించి అద్భుతమైన భావోద్వేగాలకు తీసుకెళ్లినట్లు ఆశిస్తున్నాం.” అని చెప్పుకొచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube