ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు... గ్రామ వాలంటీర్ అరెస్ట్

ఏపీలో ప్రస్తుతం సోషల్ మీడియా మీద ప్రభుత్వం నియంత్రణ విధించింది.ఎవరైనా ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి జగన్ మీద అసభ్య వ్యాఖ్యలు చేసిన, అలాగే మీడియాలో పరుష పదజాలంతో దూషించిన నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసేస్తున్నారు.

 Grama Volunteer Word On Cm Jagan-TeluguStop.com

అయితే విపక్షాల మీద వైసీపీ సానుబూతిపరులు అసభ్య పదజాలంతో దూషించిన, మార్ఫింగ్ ఫోటోలు ట్రోల్ చేసిన కూడా వారి మీద ఎలాంటి చర్యలు ఉండటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఇదిలా ఉంటే తాజాగా ముఖ్యమంత్రి జగన్ మీద వాట్స్ యాప్ లోఅసభ్యకరమైన సందేశాలు పెట్టడంతో కర్నూల్ కి చెందిన హరిప్రసాద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అతను స్థానికంగా గ్రామ వాలంటీర్ గా పని చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఏపీ అసెంబ్లీలో సమావేశాలలో భాగంగా దిశ ఎన్ కౌంటర్ పై చర్చ జరుగుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ దిశ ఘటనను ప్రస్తావిస్తూ తనకు ఒక్కతే భార్య అనే వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి పరోక్షంగా చేశారు.

దీనిపై సోషల్ మీడియాలో జనసేన పార్టీ కార్యకర్తల నుంచి విమర్శలు వస్తున్నాయి.ఇదిలా ఉంటే గ్రామ వాలంటీర్ గా పని చేస్తున్న హరిప్రసాద్ వాట్సాప్ లో అభ్యంతర కరంగా ముఖ్యమంత్రి కుటుంబసభ్యులైన భార్య, చెల్లెలు, బాబాయి, తాత లపై కామెంట్లు చేశాడు.

పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు.అయితే హరిప్రసాద్ ని అరెస్ట్ చేసే కంటే ముందు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల మీద పదే పదే అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్న వైసీపీ నాయకులు, ఆ పార్టీ కార్యకర్తల మీద కూడా పోలీసులు యాక్షన్ తీసుకోవాలని స్థానిక జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube