విడ్డూరం : ఆ పట్టణంలో కోట్లు ఉన్నా ఒక్క అంతస్తు భవనమే.. అంతస్తులు పెరిగితే అంతమేనట!

కంప్యూటర్‌ కాలంలో ఆకాశంలోకి రాకెట్లు పంపిస్తూ గ్రహాల మీద తిరుగుతున్నా కూడా కొందరు మూడ నమ్మకాలతో వెనుక బడే ఉన్నారు.అత్యంత దారుణమైన మూడ నమ్మకాలు పాటిస్తున్న వారిని చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

 Gplus Houses Not Constructed In Alampur Town Because Mudanammakam-TeluguStop.com

ఉత్తర భారతంలో మూడ నమ్మకాలు ఎక్కువగా పాటిస్తారని అంతా అనుకుంటారు.కాని మన తెలంగాణలోని జోగులాంబ జిల్లాలో కూడా ఒక పట్టణంకు చెందిన జనాలు పాటిస్తున్న పద్దతిని చూస్తే ముక్కున వేలేసుకుంటారు.

Telugu Almpure Town, Housesalampur, Double Flours-General-Telugu

పల్లెటూర్లలో కూడా ఈమద్య కాలంలో రెండు మూడు అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి.అలాంటిది అలంపూర్‌ మున్సిపాటీలో మాత్రం బహుల అంతస్తుల భవనాలు కనిపించవు.ఈమద్య కాలంలో ఒకటి రెండు వచ్చాయేమో కాని అయిదు ఏళ్ల క్రితం వరకు కూడా ఒక్కటి అంటే ఒక్కటి కూడా బహుల అంతస్తుల భవనం లేదు.ఎందుకంటే అక్కడ ఉన్న జోగులాంభ ఆలయం కంటే ఊర్లో ఏ ఇళ్లు కూడా పెద్దగా ఉండవద్దని అప్పట్లో గ్రామ పెద్దలు నిర్ణయించారట.

Telugu Almpure Town, Housesalampur, Double Flours-General-Telugu

ఎవరైనా దేవాలయం కంటే ఎత్తుగా భవనాలు కట్టినట్లయితే ఖచ్చితంగా వారి కుటుంబం నాశనం అవ్వడంతో పాటు ఆర్థికంగా చితికి పోతారు అంటూ హెచ్చరించారు.దాంతో ఎట్టి పరిస్థితుల్లోనే కోట్లు సంపాదించినా కూడా సింగిల్‌ అంతస్తు భవనాలు మాత్రమే కట్టుకున్నారు.డబుల్‌ అంతస్తు లేదా మూడు ఫ్లోర్లు బిల్డింగ్‌ కట్టనే లేదు.అత్యంత విచిత్రమైన ఈ ప్రాంతంలో స్థానికులు ఇప్పటికి కూడా అదే భయంతో ఉన్నారు.కొందరు బహుల అంతస్తుల భవనాలు కట్టుకునేందుకు ప్రయత్నించినా కూడా ఊరికి అరిష్టం అలా ఎందుకు చేస్తున్నారు అంటూ హెచ్చరిస్తున్నారు.

అధికారులు రంగంలోకి దిగి మూడ నమ్మకాలు అస్సలు వద్దు.

బహుల అంతస్తుల భవనాలకు అనుమతులు ఇస్తాం కట్టుకోండి అంటూ ప్రచారం చేస్తున్నారు.దాంతో ఈమద్య కాలంలో కాస్త పల్చ పల్చగా నిర్మాణాలు జరుగుతున్నాయి.

బహుల అంతస్తుల భవనాలు నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో పట్టణంకు ఏమైనా కీడు జరుగుతుందేమో అంటూ ఇప్పటికి కొందరు భయపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube