ఐకాన్ స్టార్ కి కథ చెప్పిన జెర్సీ దర్శకుడు

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అల్లు అర్జున్ మారిపోతున్నాడు.అలాగే స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా తన ఇమేజ్ ని మరింత పెంచుకుంటున్నాడు.

 Gowtam Tinnanuri Narrate The Story To Allu Arjun-TeluguStop.com

ఇకపై చేయబోయే సినిమాలు అన్ని కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉండేలా అల్లు అర్జున్ ప్లాన్ చేసుకుంటున్నాడు.ఇదిలా ఉంటే పుష్ప తర్వాత కొరటాల తో బన్నీ చేయాల్సిన సినిమా క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే.

కొరటాల నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్ తో చేస్తున్నాడు.దీని తర్వాత అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ఉంటుందని నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.

 Gowtam Tinnanuri Narrate The Story To Allu Arjun-ఐకాన్ స్టార్ కి కథ చెప్పిన జెర్సీ దర్శకుడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దానికి కనీసం ఏడాది పైనే పడుతుంది.ఈ లోపు మరో ప్రాజెక్ట్ ని ఫినిష్ చేసే యోచనలో అల్లు అర్జున్ ఉన్నారు.

ఈ నేపధ్యంలో జెర్సీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బాలీవుడ్ లో జెర్సీ మూవీని తెరకెక్కిస్తున్న గౌతమ్ తిన్ననూరి చెప్పిన స్టొరీ లైన్ కి బన్నీ ఒకే చెప్పి ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని సూచించినట్లు తెలుస్తుంది.జెర్సీ రీమేక్ తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే గౌతమ్ నెక్స్ట్ సినిమాకి కూడా కమిట్ అయ్యాడు.

ఈ నేపధ్యంలో రామ్ చరణ్ తో గౌతమ్ నెక్స్ట్ సినిమా ఉంటుందనే ప్రచారం జరిగింది.అయితే రామ్ చరణ్ ఇప్పుడు శంకర్ తో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు.

ఆర్ఆర్ఆర్ తర్వాత అదే స్టార్ట్ అవుతుంది.ఈ నేపధ్యంలో ఈ దర్శకుడు తన నెక్స్ట్ ఛాయస్ గా బన్నీకి ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.

ఇక గౌతమ్ రెడీ చేసిన స్టొరీతో అల్లు అర్జున్ ని మెప్పిస్తే వెంటనే దానిని సెట్స్ పైకి తీసుకెళ్ళిపోయే అవకాశం ఉంది.ఇక ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లోనే యూనివర్షల్ అప్పీల్ తోనే ఉండే విధంగా కథని సిద్ధం చేయమని గౌతమ్ కి బన్నీ సూచనలు చేసినట్లు తెలుస్తుంది.

#Allu Arjun #Icon Star #Shankar #Pan India Movie #AlluArjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు