అతడో ప్రభుత్వ ఉద్యోగి.. డబ్బు ఆశతో క్రికెట్ బెట్టింగ్.. చివరికి ఏమయ్యాడో తెలుసా..  

Govt Employee Who Addicted To Cricket Betting Held In Theft Case -

క్రికెట్ బెట్టింగ్ ఐపీఎల్ లాంటి మెగా టోర్నీ కు వచ్చాయంటే దేశ వ్యాప్తంగా బెట్టింగ్ జోరందుకుంటుంది.చాలా మంది డబ్బు కి అత్యాశ పడి వారి దగ్గర ఉన్న మొత్తాన్ని పోగొట్టుకుంటున్నారు.

Govt Employee Who Addicted To Cricket Betting Held In Theft Case

బెట్టింగ్ లో డబ్బు సంపాదించినవారు కొందరైతే అందులో డబ్బులు పోగొట్టుకున్నవాళ్లే ఎక్కువ.అయితే బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకొని చివరికి దొంగగా మారాడు ఒక ప్రభుత్వ ఉద్యోగి .అసలు విషయానికి వస్తే.

ప్రకాశం జిల్లాకి చెందిన పగడాల శ్రీను గుంటూరు రైల్వే స్టేషన్‌లో టెక్నికల్ విభాగంలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు.గత కొన్ని సంవత్సరాల నుండి క్రికెట్ బెట్టింగ్ చేస్తూ ఉన్నాడు.తనకు వచ్చే జీతం లో ఎక్కువ మొత్తం లో క్రికెట్ బెట్టింగ్ కోసమే ఉపయోగించేవాడు.

అతడో ప్రభుత్వ ఉద్యోగి.. డబ్బు ఆశతో క్రికెట్ బెట్టింగ్.. చివరికి ఏమయ్యాడో తెలుసా..-General-Telugu-Telugu Tollywood Photo Image

అలా బెట్టింగ్ లలో డబ్బు పెట్టి చాలా వరకు పోగొట్టుకున్నాడు చివరికి బెట్టింగ్ కి బానిసైన శ్రీను అప్పులు చేయడం మొదలుపెట్టాడు.అలా చేసిన అప్పు ఎక్కువ మొత్తం లో అవ్వడం తో అప్పులు ఇచ్చిన వారు శ్రీను ని తరచుగా అడిగేవారు.

అతనిపై రెండు చెక్ బౌన్స్ కేసులు కూడా నమోదయ్యాయి.

ప్రభుత్వ ఉద్యోగి నుండి దొంగగా

ఉద్యోగం నుండి వస్తున్న డబ్బులు అన్ని అప్పులకే సరిపోవడం తో శ్రీను కి బెట్టింగ్ లలో డబ్బు పెట్టేందుకు డబ్బు లేక చివరికి దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు.గత ఏడాది గుంటూరు ఆరండాల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, ఈ ఏడాది కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, ఆరండల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనానికి పాల్పడ్డాడు.ఈ నెల మొదటి వారంలో కొత్తపేట పరిధిలోని బుచ్చయ్య తోటలో ఉన్న ఓ రైల్వే ఉద్యోగి ఇంట్లో చోరీకి పాల్పడి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు నగదు దోచుకెళ్లాడు.

ఆ సొమ్ము తో బెట్టింగ్‌లు ఆడుతూ విలాసవంతంగా తిరుగుతున్నాడు.అయితే ఆ ఇంట్లో లభించిన వేలిముద్రలు ,చోరీ జరిగిన సమీప ప్రాంతాల్లోని సిసి కెమెరాల ఆధారంగా గుంటూరు సీసీఎస్ పోలీసులు నిందితుడు శ్రీనుని గుర్తించి అరెస్ట్ చేశారు.

ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తూ క్రికెట్ బెట్టింగ్ పిచ్చి వల్ల దొంగగా మారి తన జీవితాన్నే నాశనం చేసుకున్నాడు శ్రీను.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Govt Employee Who Addicted To Cricket Betting Held In Theft Case- Related....