గుడ్ న్యూస్‌: ఇక ఇ-పాస్ ‌పోర్టులు షురూ...!

ఏ దేశంలో అయినా సరే, ఎవరికైనా సరే వేరే దేశానికి వెళ్లాలంటే కచ్చితంగా పాస్ పోర్ట్ అవసరం.పాస్ పోర్ట్ అనేది ఆ వ్యక్తి యొక్క సమాచారాన్ని పూర్తిగా తెలియజేస్తుంది.

 Government To Issue E Passports With Embedded Chip,  E Pass Port, Pass Port, Ind-TeluguStop.com

అయితే ఇందుకు అప్లై చేసుకోవడానికి ఇది వరకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది.ఇకపోతే ప్రస్తుతం ఎవరైనా ఈ కరోనా సమయంలో పాస్ పోర్ట్ కు అప్లై చేయాలని భావిస్తున్నారా.? అయితే ఇకపై మీకు కేవలం ఇ- పాస్ పోర్టు మాత్రమే లభిస్తాయి.ఇది వరకు ఎవరికైనా పాస్ పోర్ట్ వచ్చిందంటే ప్రింట్ చేసి పుస్తకరూపంలో ఇచ్చేవారు.

ఇకపోతే ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మైక్రోప్రాసెసర్ చిప్ ఉన్న ఇ- పాస్ పోర్టులను ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.ఇదివరకే కేంద్ర ప్రభుత్వం 20 వేలకు పైగా కొంతమంది అఫీషియల్ కు వీటిని అందజేసింది కూడా.

అయితే ఇంతవరకు కేవలం పైలెట్ ప్రాజెక్టుగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఇకముందు దేశంలోని పౌరులందరికీ అందజేయాలని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం.అయితే ఇందుకు సంబంధించి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పలు ఏజెన్సీలతో చర్చలు జరుపుతోంది.

ఆ తర్వాత దేశంలో ఉన్న పాస్ పోర్ట్ ఆఫీసులో ఈ ప్రక్రియ యంత్రాలను ఏర్పాటు చేసి సేవలు అందించబోతున్నారు.వీటి సహాయంతో ఏకంగా ఒక గంటకు 10 నుంచి 20 వేల పాస్ పోర్ట్ లను జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ ప్రక్రియ విజయవంతమైతే పాస్ పోర్ట్ కావాలనుకునే వారికి అతి సులువుగా లభించదు పోతుంది.

Telugu Port, Embedded Chip, India, Officals, Passportseva-

ఇందువల్ల ఎవరైనా వారి పాస్ పోర్ట్ లను పోగొట్టుకున్న ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.అయితే ఇ- పాస్ పోర్టులు కేవలం కొత్త వారికి మాత్రమే కాదు, ఎవరైనా రెన్యువల్ చేసుకునేవారు కూడా ఈ అవకాశం లభిస్తోంది.ఇందుకు సంబంధించిన ప్రక్రియ అతి త్వరలో మొదలు కాబోతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube