రామ్ అసుర్ చిత్రాన్ని వీక్షించి యూనిట్ ని అభినందించిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

రామ్ అసుర్ చిత్రాన్ని వీక్షించి యూనిట్ ని అభినందించిన గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. అభినవ్ సర్దార్, రామ్ కార్తీక్ హీరోలుగా వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రామ్ అసుర్.

 Govt Chief Vip Dasyam Vijay Bhaskar Appreciated Ram Asur Movie Unit-TeluguStop.com

చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శెర్రి అగర్వాల్ హీరోయిన్ లుగా నటించిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించగా విడుదలైన తొలి రోజు నుంచి ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంటుంది.

ఈ సినిమా లో కథ హైలైట్ కాగా అభినవ్ సర్దార్, రామ్ కార్తిక్, శానీ సల్మాన్ ల నటన మెయిన్ హైలైట్ గా నిలిచింది.

 Govt Chief Vip Dasyam Vijay Bhaskar Appreciated Ram Asur Movie Unit-రామ్ అసుర్ చిత్రాన్ని వీక్షించి యూనిట్ ని అభినందించిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

హీరోయిన్స్ గ్లామర్ అదనపు ఆకర్షణ.దర్శకుడు వెంకటేష్ త్రిపర్ణ సరికొత్త కథ కథనాలతో ఆద్యంతం ఈ సినిమా ను ప్రేక్షకులు అలరించే విధంగా ముందుకు తీసుకెళ్లారు.కాగా ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ సెలెబ్రేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి.ఈమధ్య కొన్ని నగరాల్లో ప్రేక్షకులతో కలిసి సినిమా ను వీక్షించిన చిత్ర బృందం తాజాగా వరంగల్ లో సందడి చేసింది.

గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారితో కలిసి సినిమా ను వీక్షించింది చిత్ర బృందం.

Telugu Abhinav Sardar, Appreciated Ram Asur Movie Unit, Govt Chief Vip Dasyam Vijay Bhaskar, Ram Asur Movie, Ram Karthik, Shanee Salman, Success Celebrations, Tollywood-Movie

ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.రామ్ అసుర్ సినిమా అద్భుతంగా ఉంది.హీరో అభినవ్ సర్దార్, రామ్ కార్తిక్ ల నటన చాలా బాగుంది.

ప్రత్యేకమైన పాత్రలో శానీ సల్మాన్ మంచి నటన కనపరిచాడు.దర్శకుడు వెంకటేష్ ఈ సినిమా ను మంచి కథ తో తెరకెక్కించి విజయం సాధించారు.

చిత్రాన్ని యూనిట్ తో కలిసి వీక్షించినందుకు ఎంతో సంతోషంగా ఉంది.తప్పకుండా ఈ సినిమా మంచి వసూళ్లను సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.

#Asur Unit #Ram Karthik #VipDasyam #Abhinav Sardar #Shanee Salman

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube