బాలీవుడ్ సినీ పరిశ్రమని ఆ నలుగురే శాసిస్తున్నారంట...

బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఇటీవలే యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మానసిక ఒత్తిళ్లను తట్టుకోలేక తన సొంత నివాసంలోనే ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎంతగా కలకలం సృష్టించిందో అందరికీ బాగా తెలుసు.అయితే ఈ ఘటన జరిగినప్పటి నుంచి బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఉన్నటువంటి నేపోటిజం కారణంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి కొత్త అవకాశాలు రాకుండా చేసి  అతడి ఆత్మహత్యకి కొంత మంది సినీ ప్రముఖులు పరోక్షంగా కారణమయ్యారని కొందరు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అభిమానులు ఆరోపణలు చేస్తున్నారు.

 Govinda, Bollywood Hero, Nepotism In Film Industry, Bollywood-TeluguStop.com

అయితే తాజాగా ఈ విషయంపై బాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు గోవిందా స్పందించాడు.ఇందులో భాగంగా బాలీవుడ్ సినీ పరిశ్రమలో నేపోటిజం అనేది ఉందని ఈ నేపోటిజం కారణంగా తాను కూడా గతంలో పలు సినీ అవకాశాలను కోల్పోయానని చెప్పుకొచ్చాడు.

అంతేగాక ఒకానొక సమయంలో తాను హీరోగా నటించినటువంటి కొన్ని చిత్రాలను కొంతమంది సినీ ప్రముఖులు కావాలనే విడుదల కాకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.అంతేగాక ప్రస్తుతం బాలీవుడ్ సినీ పరిశ్రమని పరిశ్రమలో ఉన్నటువంటి నలుగురైదుగురు వ్యక్తులు ఏలుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఐతే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం గోవిందా ఓ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న పింకీ డార్లింగ్ మరియు నేషనల్ హీరో అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు.అలాగే మరో వైపు రాజకీయాల్లో కూడా తన సేవలందిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube