గవర్నర్ వర్సెస్ సీఎం ! ఇక వివాదం ముగిసినట్టేనా ?

తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ మధ్య గత కొంతకాలంగా పరోక్ష యుద్ధ వాతావరణం కనిపించింది.  ముఖ్యంగా కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలను కొన్నింటిని అమలు చేసే విషయంలో గవర్నర్ పెండింగ్ లో పెట్టడం,  కొన్ని కొన్ని విషయాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా గవర్నర్ వ్యవహరించడం ఇవన్నీ కెసిఆర్ కు ఆగ్రహం కలిగించింది.

 Governor Vs. Cm Is The Controversy Over Anymore, Kcr, Telangana Governor, Tamil-TeluguStop.com

దీంతో 9 నెలలుగా గవర్నర్ కార్యాలయానికి కేసీఆర్ అడుగు పెట్టకుండా దూరంగా ఉన్నారు.ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లాల్సి ఉన్నా … తన స్థానం లో ఏదో ఒక శాఖ మంత్రిని పంపించి కెసిఆర్ తన అసంతృప్తిని ఆ విధంగా వెళ్లగక్కేవారు.

ఇక గవర్నర్ సైతం తన విచక్షణ అధికారాలను ఉపయోగించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి నట్లుగానే వ్యవహరించారు.ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి.

మరి గతంలో గవర్నర్ కేసీఆర్ తీరును తప్పు పట్టారు.ఇక మేడారం జాతరకు వెళ్లిన గవర్నర్ కు సరైన ప్రోటోకాల్ అందలేదు.అధికారులు స్వాగతం పలకాకపోవడం, ప్రభుత్వం నుంచి హెలికాఫ్టర్ కేటాయించకపోవడం వంటివన్నీ గవర్నర్ అనేక సందర్భాల్లో ప్రస్తావించారు.ఈ వ్యవహారాల తర్వాత గవర్నర్ రాజ్ భవన్ లో మహిళా దర్బార్ ను నిర్వహించారు.

ఈ వ్యవహారం కేసీఆర్ కు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది.

Telugu Pragathi Bhavan, Rajbhavan, Tamilsoundarya, Telangana Cm-Politics

ఇదిలా ఉంటే హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం ను పురస్కరించుకుని రాజ్భవన్ కు కెసిఆర్ హాజరు కావడం,  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ను గవర్నర్ తమిళ సై ఆత్మీయంగా పలకరించడం , ఇద్దరు కలిసి తేనేటి విందు ను స్వీకరించడం వంటివి జరిగాయి.దీంతో ప్రగతిభవన్ కు రాజ్ భవన్ కు మధ్య గ్యాప్ తగ్గిపోయినట్లుగానే అక్కడి వాతావరణం కనిపించింది.ఇక ముందు ముందు ఒకరికి ఒకరు సహకరించుకుంటూనే ముందుకు వెళ్తారనే విధంగా కేసీఆర్ , గవర్నర్ మధ్య సంభాషణ జరిగినట్టు గా కనిపించడంతో ఇక ఈ వ్యవహారానికి పులిస్టాప్ పడినట్లేనని ప్రచారం జరుగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube