బీజేపీ పై ఆ రాష్ట్ర గవర్నర్ సంచలన వ్యాఖ్యలు.. ?

కేంద్ర రాజకీయాలపై ఇప్పటికే పలు విమర్శలు వెలువడుతున్న నేపధ్యంలో మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇదివరకు కూడా ఒకసారి సత్యపాల్ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

 Governor Sensational Comments On Bjp Meghalaya, Governor, Satyapal Malik, Bjp,-TeluguStop.com

కాగ కేంద్రం తీసుకువచ్చిన నూతన చట్టాల విషయంలో వీలైనంత త్వరగా రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని, ఇంకా ఇదే మొండి పట్టుదల ప్రదర్శిస్తూ రైతులకు న్యాయం చేసే దిశగా ఆలోచించకుంటే భవిష్యత్తులో బీజేపీకి తీరని నష్టం వాటిల్లుతుందని వ్యాఖ్యానించారు.

ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానాలలో బీజేపీ తన ఉనికిని కోల్పోవలసి వస్తుందని హెచ్చరించారు.

ఇక రైతు చట్టాలకు నిరసనగా ఇప్పటికే సుమారు 250 మంది రైతులు ప్రాణాలు విడిచారు.కానీ ఏ ఒక్కరు కూడా ఈ విషయంలో స్పందించలేదు సరికదా కనీసం సంతాపం కూడా వ్యక్తం చేయకపోవడం బాధాకరం అంటూ తన ఆ ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా సంకల్పంతో ఉద్యమిస్తున్న రైతులకు అన్యాయం చేయొద్దని, వారితో త్వరలో చర్చలు ప్రారంభించి తగిన పరిష్కారం చూపాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఇక తన వ్యాఖ్యలు పార్టీకి గానీ, ప్రభుత్వానికి గానీ నష్టం చేకూర్చినట్టు అనిపిస్తే పదవి నుంచి తప్పుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని సత్యపాల్ మాలిక్ పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube