సీఎం చదవమన్నారు అంటూ అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు

గవర్నర్ హోదాలో ఉన్న వ్యక్తి అసెంబ్లీ సాక్షిగా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం రాజకీయం పెద్ద దుమారం రేగుతుంది.రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టే తీర్మానాలను సమ్మతించాలా,వద్దా అన్న నిర్ణయాధికారం ఉన్న గవర్నర్ అసెంబ్లీ సాక్షిగా సీఎం చదవమన్నారని ఈ పేరా చదువుతున్నాను అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం విశేషం.

 Governor Said Reading This Caa Paragraph To Honour Cms Wish-TeluguStop.com

ఈ ఘటన కేరళ అసెంబ్లీ లో బుధవారం చోటుచేసుకుంది.కేరళ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనడం కోసం సీఎం తో కలిసి గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కూడా అక్కడకి వచ్చారు.

ఈ సమావేశాల్లో భాగంగా గవర్నర్ తన ప్రసంగం ఇవ్వాల్సి ఉండగా పోడియం వద్దకు వెళుతున్న ఆయనను కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష యూడీఎఫ్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు.దీనితో పోడియం వద్దకు వెళ్లే మార్గానికి అడ్డుగా నిలబడి గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడమే కాకుండా సీఏఏను గవర్నర్ సమర్థించడాన్ని తప్పుబడుతూ… ‘యాంటీ సీఏఏ’ ప్లకార్డులు పట్టుకుని ‘గవర్నర్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు.

అయితే ప్రతి పక్షాల నినాదాల నుంచో ఎలాగో భద్రతా సిబ్బంది సాయం తో పోడియం వద్దకు వెళ్లిన గవర్నర్ తన ప్రసంగాన్ని వినిపించారు.ఈ క్రమంలోనే ఆయన ఇలాంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

ఈ తీర్మానం నా అభిప్రాయానికి అనుగుణంగా లేదని.కానీ ఈ పేరాగ్రాఫ్‌ను సీఎం చదవమన్నారని చదువుతున్నాను అంటూ గవర్నర్ ఖాన్ వ్యాఖ్యానించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.

అసలు గవర్నర్ కు ఇష్టం లేకుండానే సీఏఏ కు మద్దతు తెలుపుతూ ప్రసంగాన్ని ఇచ్చారా,అసలు గవర్నర్ గారి మాటల్లో ఉన్న అర్ధం ఏంటి అన్నది అర్ధం కావడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube