'షా' తో గవర్నర్ నరసింహన్ భేటీ.... కారణం అదేనా  

Governor Narasimhan Meets Amith Sha-

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తరువాత ఇప్పుడు ప్రధానంగా చర్చకు దారి తీసుతున్న అంశం. తెలుగు రాష్ట్రాల గవర్నర్ మారనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వీటిపై స్పష్టమైన సమాచారం లేదు కానీ ఈ వార్తలకు తోడు ఇప్పుడు తాజాగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు..

'షా' తో గవర్నర్ నరసింహన్ భేటీ.... కారణం అదేనా-Governor Narasimhan Meets Amith Sha

దీనితో ఈ వార్తలలో నిజముంది అన్న విషయం స్పష్టమౌతుంది. రెండో దఫా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు మార్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో గవర్నర్లను మార్చాలని కేంద్రం భావిస్తున్నట్టు ఇటీవల ప్రచారం సాగుతోంది.

తెలంగాణ రాష్ట్రానికి మాజీ కేంద్ర మంత్రి సుష్మస్వరాజ్‌ లేదా పాండిచ్చేరి గవర్నర్ కిరణ్‌బేడీలలో ఎవరో ఒకరిని గవర్నర్ గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్రం లో ప్రభుత్వాన్ని ఏర్పరచిన బీజేపీ సుష్మా స్వరాజ్ కు ఈ సారి మంత్రి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టింది. ఈవిధంగా తెలుగు రాష్ట్రాలలో ఒక రాష్ట్రానికి గవర్నర్ ని నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

ఇలాంటి సమయంలో గవర్నర్ నరసింహాన్‌తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది. అయితే భేటీ ముగిసిన తరువాత గవర్నర్ మాట్లాడుతూ కేవలం మర్యాద పూర్వకంగానే షా ను కలిశానని, తెలుగు రాష్ట్రాల తాజా రాజకీయ పరిణామాలపై అమిత్ షాకు వివరించానన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై కూడా ఈ భేటీ లో చర్చించినట్లు తెలిపారు.