కర్ణాటకలో రాజకీయ సంక్షోభం, దేవెగౌడ అన్నట్లే జరిగిందిగా  

Governor Devegowda About Government of Karnataka Politics -

కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు అక్కడ ఏర్పడిన సర్కార్ సంక్షోభంలో పడింది.

Governor Devegowda About Government Of Karnataka Politics

ఆ పార్టీ లకు చెందిన దాదాపు 11 మంది శాసన సభ సభ్యులు రాజీనామా బాట పట్టడం తో కర్ణాటకలో రాజకీయసంక్షోభం తలెత్తింది.ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఇంకా ఆనంద్ సింగ్ రాజీనామా నుంచి తేరుకోకుండానే అక్కడ ఏర్పడిన సంకీర్ణ సర్కార్ కు ఇప్పుడు మరో గట్టి ఎదురుదెబ్బ తగలనుంది.ఎమ్మెల్యేలు బీసీ పాటిల్‌, మునిరత్న, ప్రసాద గౌడ పాటిల్‌, శివరామ, రామలింగా రెడ్డి, సౌమ్యారెడ్డి, సోమశేఖర్‌, రమేశ్‌ జక్కహళ్లి తదితరులు తమ రాజీనామా పత్రాలతో స్పీకర్‌ కార్యాలయానికి వెళ్లి సభాపతి అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది.

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం, దేవెగౌడ అన్నట్లే జరిగిందిగా-Political-Telugu Tollywood Photo Image

అయితే ప్రస్తుతం స్పీకర్‌ అందుబాటులో లేకపోవడం తో ఆయన వచ్చిన తర్వాత ఏ క్షణమైనా వీరు రాజీనామాలు సమర్పించే అవకా శమైతే కనిపిస్తుంది.‘రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తప్పదు.

మధ్యంతర ఎన్నికలు రానున్నాయి,ఐదేళ్ల పాటు మద్దతిస్తామని కాంగ్రెస్‌ పార్టీ చెప్పింది.కానీ ప్రస్తుతం ఆ అవకాశాలు లేవు’ అని ఇటీవల జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

ఆయన నోటినుంచి వచ్చిన మాటల తో అక్కడ రాజకీయ దుమారం రేగడం తో ఎదో తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు కానీ.దేవెగౌడ అన్నట్లే అక్కడ రాజకీయ సంక్షోభం తప్పడం లేదు.

ఒకవేళ 11 మంది ఎమ్మెల్యేలు గనుక రాజీనామా లు సమర్పిస్తే మాత్రం తప్పకుండా సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభం లో పడిపోతుంది.కర్ణాటకలో మొత్తం 225 అసెంబ్లీ స్థానాలకు గాను.

గతేడాది జరిగిన ఎన్నికల్లో భాజపా 104 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది.అయితే ఇదే ఎన్నికల్లో అటు కాంగ్రెస్‌ 80, జేడీఎస్‌ 37 సీట్లలో గెలిచి ఇరు పార్టీలు చేతులు కలపడం తో మ్యాజిక్ ఫిగర్ 113 స్థానాలను దాటడం తో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనీ ముందురావడం దానికి గవర్నర్ కూడా ఆమోదం తెలపడం తో ఆ నాడు కన్నడ నాట సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

అయితే ఇటీవల ఆనంద్‌ సింగ్‌ రాజీనామాతో కాంగ్రెస్‌-జేడీఎస్‌ బలం 116కు పడిపోయింది.తాజాగా మరో 11 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను కూడా స్పీకర్‌ ఆమోదిస్తే కూటమి బలం 105కి పడిపోతుంది.దీంతో ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది.కాంగ్రెస్‌కు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు జేడీఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్ధపడినట్లు తెలుస్తుంది.దీనితో కన్నడ నాట రాజకీయ సంక్షోభం తప్పదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.మరి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న బీజేపీ ఈ అంశాన్ని అంత తేలికగా ఏమీ తీసుకోదు.

వచ్చిందే అవకాశం గా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన అన్ని చర్యలకు పూనుకుంటుంది.మరోపక్క ఈ విషయం తెలుసుకున్న కర్ణాటక సీఎం కుమారస్వామి హుటాహుటిన తన అమెరికా పర్యటనను మధ్యలోనే రద్దు చేసుకొని స్వదేశానికి తిరిగివచ్చినట్లు తెలుస్తుంది.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Governor Devegowda About Government Of Karnataka Politics Related Telugu News,Photos/Pics,Images..