గవర్నర్ గారి కుమార్తె ' రాజకీయం ' ఏంటి ? 

Governor Bandaru Dattatreya Daughter Vijayalaxmi Active On Politically

బీజేపీలో కీలక నేతగా, కేంద్రమంత్రిగా గతంలో పని చేసి,  ప్రస్తుతం హర్యాన గవర్నర్ గా ఉన్న బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది .ఆమె గత కొద్ది రోజులుగా యాక్టీవ్ అయ్యారు.

 Governor Bandaru Dattatreya Daughter Vijayalaxmi Active On Politically-TeluguStop.com

దీంతో ఆమె పేరు పదే పదేపదే ప్రస్తావనకు వస్తోంది.ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి కీలకం కావడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  ఆమె రాజకీయం గా అనే యాక్టీవ్ అయ్యే ఆలోచనలో ఉన్నారని, అందుకే ఇప్పుడు బాగా యాక్టివ్ అయినట్టుగా ప్రచారం జరుగుతోంది.
    ఇప్పటి వరకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కు రాజకీయ వారసులు లేరు.

 Governor Bandaru Dattatreya Daughter Vijayalaxmi Active On Politically-గవర్నర్ గారి కుమార్తె రాజకీయం ఏంటి  -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ఆమె కుమార్తె విజయలక్ష్మి కొన్ని కొన్ని అంశాలలో యాక్టివ్ గా వ్యవహరిస్తున్నారు.దీంతో ఆమెను రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారా అని సందేహాలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి.ప్రతి ఏడాది దసరాకు దత్తాత్రేయ ఆధ్వర్యంలో అలాయ్ బలాయ్ కార్యక్రమం నిర్వహించేవారు.ఇది బాగా ఫేమస్.

గతేడాది కరోనా కారణంగా ఈ కార్యక్రమం నిర్వహించలేదు.అయితే ఈ ఏడాది మాత్రం జలవిహార్ లో భారి ఏర్పాట్లు చేశారు.

దీనికి సంబంధించిన అన్ని వ్యవహారాలను దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి పర్యవేక్షించారు.అలాగే ప్రముఖులకు ఆహ్వానాలు అందించడం దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలను ఆమె స్వయంగా చేపట్టారు.

ఈ వ్యవహారాలన్నీ ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకే అనే అనుమానాలు మొదలయ్యాయి.అయితే ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తే ఎక్కడి నుంచి చేస్తారు అనే విషయం పైన చర్చ జరుగుతోంది.
   

  గతంలో దత్తాత్రేయ ఎంపీగా పనిచేసిన సికింద్రాబాద్ ప్రస్తుతం ఖాళీ లేదు.అక్కడి నుంచి కిషన్ రెడ్డి గెలవడంతో కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు.అలాగే విజయలక్ష్మి మామ జనార్దన్ రెడ్డి సైతం బీజేపీ లోనే ఉన్నారు.ఆయన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు.విజయలక్ష్మి ఈ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయాలని చూసినా, ఆమె మామ జనార్దన్ రెడ్డి నుంచి పెద్దగా అభ్యంతరం ఉండదు.అయితే ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అనుకుంటే మాత్రం జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు బీజేపీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.

#Bandi Sanjay #Dasara Festival #JublihilsMla #Chevella MP #Halay Balay

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube