సత్వర వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం:డాక్టర్ సుచరిత

నల్లగొండ జిల్లా:బడుగు బలహీనవర్గాల వారికి సత్వర వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని వేములపల్లి వైద్యాధికారి డాక్టర్ సుచరిత అన్నారు.సోమవారం నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మండలానికి కొత్తగా మంజూరు చేసిన 108 వాహనాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని,దీనికి నిదర్శనమే ఆరోగ్యశ్రీ సేవలను(Aarogyasri Services) రూ.10 లక్షలకు పెంచడంతోపాటు ప్రతి మండలానికి ఒక 108 వాహనాన్ని అందించడమేనన్నారు.ఈ కార్యక్రమంలో 108 జిల్లా మేనేజర్ వై.మధు, ఈఎంటి సైదులు,డ్రైవర్ సోమయ్య,మండల నాయకులు పుట్టల కృపయ్య,పుట్టల శ్రీను, రవీందర్ రెడ్డి,ఎల్లారెడ్డి, వెంకటేశ్వర్లు,సోమాచారి, శ్రీధర్,వినోద్,గిరి,కవిత, శైలజ తదితరులు పాల్గొన్నారు.

Latest Nalgonda News