పశువుల పెంపకందారులకు ప్రభుత్వ నజరానా

వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకం ఫలితంగా భారతదేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు.అయితే గత కొన్నేళ్లుగా పొలాల్లో సేంద్రియ ఎరువు వాడేలా ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తోంది.

 Government To Give Monthly 900 Buying Cow Government, Monthly 900 , Cow ,nature Farming, Shivraj Singh Chouhan, Madhya Pradesh-TeluguStop.com

దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు వివిధ పథకాలు కూడా ప్రారంభించారు.మధ్యప్రదేశ్‌లో, సహజ వ్యవసాయం కోసం దేశవాళీ ఆవులను పెంచే రైతులకు శివరాజ్ సర్కార్ నెలకు రూ.900 అంటే సంవత్సరానికి రూ.10 వేల 800 అందజేయనున్నారు.అంతే కాకుండా రైతులు పాలను విక్రయించడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చన్నారు.దీనితో పాటు ఆవు పేడ, మూత్రాన్ని కూడా పొలాల్లో ఎరువుగా ఉపయోగించవచ్చు.ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆవును కొనుగోలు చేసే రైతుకు ప్రభుత్వ ఖజానా నుంచి నెలకు రూ.900 అందజేస్తామని ఓ కార్యక్రమంలో సీఎం శివరాజ్‌ తెలిపారు.

రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం వల్ల భూమి ఆరోగ్యం క్షీణిస్తోంది.దీంతో ఆహారం కలుషితమవుతోంది.ఫలితంగా రోగాలు వస్తున్నాయి.సహజ వ్యవసాయంలో శిక్షణ ఇప్పించేందుకు చర్యలు చేపడుతున్నారు.30 ఎకరాల భూమికి ఒక ఆవు నుంచి వచ్చే పేడ, గోమూత్రం సరిపోతుందని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.పశుపోషణతో చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నారు.

 Government To Give Monthly 900 Buying Cow Government, Monthly 900 , Cow ,Nature Farming, Shivraj Singh Chouhan, Madhya Pradesh-పశువుల పెంపకందారులకు ప్రభుత్వ నజరానా-Agriculture-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వ్యవసాయంలో సేంద్రియ ఎరువుల వాడకంలో ఖర్చు తక్కువ అని తెలిపారు.వచ్చే పంట ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉంటుందని, దాని వల్ల ఎలాంటి రోగాలు రావని తెలిపారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube