రవితేజ సినిమాను డిసైడ్ చేస్తున్న మోదీ

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ క్రాక్ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Government To Decide Raviteja Krack Release, Raviteja, Krack, Release, Governmen-TeluguStop.com

ఇక ఈ సినిమాతో అదిరిపోయే సక్సెస్‌ను అందుకోవాలని రవితేజ భావిస్తున్నాడు.ఈ క్రమంలోనే క్రాక్ చిత్రాన్ని పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తీర్చిదిద్దింది.

ఈ సినిమాను తొలుత మే 8న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు.

ఇక థియేటర్లు ఇప్పట్లో తెరుచుకోకపోవడంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారేమో అని అందరూ ఎదురుచూశారు.కానీ ఏదేమైనా ఈ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని దర్శకుడు తెలిపాడు.

అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ విషయాన్ని ప్రధాని మోదీ నిర్ణయించనున్నాడు.

క్రాక్ సినిమా రిలీజ్‌ను మోదీ నిర్ణయించడం ఏమిటి అనుకుంటున్నారా? అవును.కేంద్ర ప్రభుత్వం దశలవారీగా లాక్‌డౌన్‌ను ఎత్తేస్తున్న సంగతి తెలిసిందే.అయినా కూడా ఇప్పటివరకు థియేటర్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.దీంతో కేంద్ర ప్రభుత్వం థియేటర్లను ఎప్పుడు తెరుస్తారా అని అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.ఒక్కసారి థియేటర్లు తెరుచుకునేందుకు మోదీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే క్రాక్ సినిమాను థియేటర్స్‌లో దించాలని చిత్ర యూనిట్ చూస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube