క్రిస్మస్ గిఫ్ట్ పేరుతో విద్యార్థులకు బైబిల్లు పంచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపురం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ప్రభుత్వ ఉపాధ్యాయనిగా పనిచేస్తున్న లింగాల రాజు అనే ఉపాధ్యాయుడు క్రిస్మస్ గిఫ్ట్ పేరుతో సుమారు 100 మంది విద్యార్థులకు బైబిల్లను సుమారు పదిన్నర గంటల ప్రాంతంలో పంపిణీ చేశాడనీ ఈ విషయాన్ని పాఠశాల విద్యార్థులు స్థానిక బిజెపి పార్టీ నాయకులకు, ఏబీవీపి విద్యార్థి నాయకులకు ఫిర్యాదు చేయగా స్థానిక బిజెపి పార్టీ,ఏబీవీపీ కి చెందిన నాయకులు బొమ్మెడ స్వామి, వంగల రాజ్ కుమార్, ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేని రంజిత్ కుమార్ నారాయణపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకొని లింగాల రాజు అనే ఉపాధ్యాయుడు పంచిన బైబిల్ల ను విద్యార్థుల నుండి స్వాధీనం చేసుకున్నారు.

పాఠశాల ఉపాధ్యాయ గదిలో ఉన్న మరో బైబిల్ల ప్యాకింగ్ ను స్వాధీనం చేసుకున్నారు.

బిజెపి, ఏబీవీపీ నాయకులు ఎల్లారెడ్డిపేట మండల విద్యాధికారి కృష్ణ హరికి ఫిర్యాదు చేశారు.పంపిణీకి సంబంధించి చిత్రీకరణను వీడియోలు తీసి బిజెపి నాయకులు ఎంఈఓ కు అందజేశారు.

ప్రభుత్వ పాఠశాలలో వందమంది విద్యార్థులకు క్రిస్మస్ గిఫ్ట్ ల పేరుతో బైబిల్ల ను పంచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు లింగాల రాజ పై వెంటనే విచారణ జరిపి సస్పెండ్ చేయాలని బిజెపి, ఏబీవీపీ నాయకులు కోరారు.ఈ విషయంపై జిల్లా డీఈఓ కు,జిల్లా కలెక్టర్ కు ఈ ఫిర్యాదు చేయనుట్లు వారు తెలిపారు.

ఉపాధ్యాయుడి సస్పెన్షన్

విద్యాలయంలో మత ప్రచారం చేసేందుకు యత్నించిన ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ లింగాల రాజును సస్పెండ్ చేస్తూ డీఈఓ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ మతానికి సంబంధించిన కరపత్రం, ఇతర సామాగ్రి విద్యార్థులకు పంపిణీ చేశారు.

Advertisement

ఈ విషయం జిల్లా విద్యాధికారి కి చేరడంతో ఆ ఉపాధ్యాయుడి నీ సస్పెండ్ చేసినట్లు డీఈఓ తెలిపారు.

రాజన్న ను దర్శించుకున్న తెలుగు సినీ నటి గార్లపాటి కల్పలత
Advertisement

Latest Rajanna Sircilla News