భారత్ బంద్ కు ప్రభుత్వ మద్దతు.. మంత్రి పేర్ని నాని ప్రకటన

భారత్ బంద్ కు ప్రభుత్వ మద్దతు మంత్రి పేర్ని నాని ప్రకటన కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న భారత్ బంద్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూత్రప్రాయంగా సంపూర్ణ మద్దతు తెలుపుతుందని రాష్ట్ర రవాణా శాఖ సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రకటించారు.స్థానిక ఆర్ అండ్ బీ అతిథి గృహంలో శనివారం విలేకరులతో మంత్రి నాని మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రజల ఆస్తిగా ఉంచాలని కార్పొరేట్ శక్తులకు అమ్మవద్దని ప్రజల తరపున కేంద్రాన్ని కోరుతున్నట్లు చెప్పారు ‌.

 Government Support For Bharat Bandh .. Nani's Statement On The Name Of The Minis-TeluguStop.com

రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరారు.భారత్ బంద్ సందర్భంగా 26 అర్ధరాత్రి నుంచి 27 మధ్యాహ్నం 1 (ఒంటిగంట) వరకు ఆర్టీసీ బస్సులు నిలిపివస్తున్నట్లు  మంత్రి పేర్ని నాని తెలిపారు.

మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత బస్సులు అందుబాటులో ఉంటాయి అని ప్రజలు గమనించాలని అన్నారు.భారత్ బంద్ కు ప్రజలు, రాజకీయ పార్టీలు శాంతియుతంగా నిరసన తెలపాలని కోరారు.

ఈ సందర్భంగా భారత్ బంద్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూత్రప్రాయంగా సంపూర్ణ మద్దతు తెలుపుతుందని రాష్ట్ర రవాణా  సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రకటించారు.విడుదల చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube