పార్లమెంటులో మత అసహనం మీద దుమారమే

రాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాలు చాలా వాడిగా వేడిగా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి.బీహారులో బీజేపీ కొంప ముంచిన, దేశంలో పెద్ద సమస్యగా మారిన మత అసహనం మీద ప్రతిపక్షాలు విరుచుకు పడొచ్చు.

 Government Ready To Discuss ‘intolerance’ Issue-TeluguStop.com

ఈ సంగతి ప్రభుత్వానికి కూడా తెలుసు.అందుకే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు మత అసహనం మీద పార్లమెంటులో చర్చకు సర్కారు సిద్ధంగా ఉందని అన్నారు.

చర్చకు భయపడబోమని చెప్పారు.మత అసహనం అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశం అయింది.

బ్రిటన్ వెళ్ళిన ప్రధాని మోడీ భారత్లో అసహనం లేదన్నారు.మీరు సహనంగా ఉంటే సభలో అసహనంపై సజావుగా చర్చ జరపవచ్చు అని వెంకయ్య ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారు.

బీహార్ తీర్పు ప్రభావం పార్లమెంటు సమావేశాల మీద ఉండదన్నారు.కర్ణాటకలో కాల్బుర్గీ, మహారాష్ట్రలో దభోల్కర్, యూపీలో దాద్రి హత్య కేసులతో బీజేపీకి సంబంధం లేదని వెంకయ్య స్పష్టం చేసారు.

మత అసహనం మీద ప్రతిపక్షాలు దుమారం లేవదీస్తే వాటిని ఎదుర్కొనే బాధ్యతను వెంకయ్యకే మోడీ అప్పగిస్తారు.ట్రబుల్ షూటర్ ఆయనే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube