రిక్రూట్‌ ఏజెన్సీలకు కళ్లెం: తాత్కాలిక విదేశీ కార్మికులకు కెనడా ప్రావిన్స్ రక్షణలు

తాత్కాలిక విదేశీ కార్మికులకు మరిన్ని రక్షణలు కల్పించేందుకు కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్‌ కొత్త నిబంధనలను ప్రకటించింది.కొత్త మార్గదర్శకాల ప్రకారం తాత్కాలిక విదేశీ కార్మికులు, ఉద్యోగుల నియామకానికి సంబంధించి రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలకు పర్మిట్లు అవసరం.

 Government Quebec Announces Regulations To Foreign Workers-TeluguStop.com

అలాగే ఇప్పటికే సేవలను అందిస్తున్న ఏజెన్సీలు తమ కార్యకలాపాలను చట్టబద్ధంగా కొనసాగించడానికి 2020 జనవరి 1 మరియు ఫిబ్రవరి 14 మధ్య పర్మిట్ కోసం క్యూబెక్ ప్రావిన్స్‌లోని కార్మిక ప్రమాణాలను పరిరక్షించే ప్రొవిన్షియల్ కమీషన్ (సీఎన్ఈఎస్ఎస్‌టీ)కి దరఖాస్తు చేసుకోవాలి.

సీఎన్ఈఎస్ఎస్‌టీ పర్మిట్ వ్యవస్థను నియంత్రించడంతో పాటు రిక్రూటర్లు, యాజమాన్యాల చర్యలను పర్యవేక్షిస్తుంది.

ఈ కొత్త నిబంధనలు ఏజెన్సీ కార్మికులు, తాత్కాలిక విదేశీ కార్మికులకు న్యాయమైన మరియు సమానమైన పని పరిస్ధితులకు అర్హతనివ్వడంతో పాటు సానుకూల పని వాతావారణాన్ని కల్పించడానికి వీలు కల్పిస్తుందని కార్మిక, ఉపాధి మరియు సామాజిక శాఖ మంత్రి జీన్ బౌలెట్ మీడియాకు తెలిపారు.

ఒకవేళ ఏజెన్సీలు కొత్త నిబంధనలను ఉల్లంఘిస్తే వాటి లైసెన్స్‌లను రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు.

క్యూబెక్ కార్మిక ప్రమాణాల చట్టం ప్రకారం వారి యజమాని చెల్లించాల్సిన మొత్తాలను చెల్లించనిపక్షంలో కార్మికులకు పరిహారం చెల్లించేందుకు గాను 15,000 డాలర్ల సెక్యూరిటీ సిబ్బందిని సదరు ఏజెన్సీలు సమర్పించాల్సి ఉంటుంది.జనవరి 1 నాటికి రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు కార్మికులకు క్లయింట్ సంస్థ యొక్క సిబ్బంది కంటే తక్కువ జీతాన్ని ఇవ్వడం నిషేధించబడతుంది.

అలాగే వేతనాన్ని నిర్ణయించడానికి యజమాని కార్మికుడి అనుభవం, నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకోవాలి.

Telugu Americanlaws, Caneda, Protect Foreign, Telugu Nri Ups-

ఇదే సమయంలో ఏజెన్సీలకు లైసెన్సింగ్ విధానాన్ని ఏర్పరచడంతో పాటు కొత్త నిబంధనలు యాజమాన్యాల ప్రవర్తనను సైతం నియంత్రిస్తాయి.కెనడియన్ ప్రభుత్వానికి సంబంధించిన ఏజెన్సీలు తప్పించి… యజమానులు విదేశీ కార్మికుల నుంచి ఫీజును వసూలు చేయరాదు, అలాగే వారి పాస్‌పోర్ట్, ఇతర ధ్రువీకరణ పత్రాలను యాజమాన్యాలు బలవంతంగా తీసుకోరాదు.తాత్కాలిక విదేశీ కార్మికులు కెనడాలో సాగించిన రాకపోకల వివరాలను యాజమాన్యాలు సీఎన్ఈఎస్ఎస్‌టీకి అందించాల్సి ఉంటుంది.

మొత్తం మీద ఈ కొత్త విధానాల ద్వారా మోసపూరితంగా, నేరం చేసే ఉద్దేశ్యంతో ఏజెన్సీని ఏర్పాటు చేయడం ఇకపై అసాధ్యమని.ఇదే సమయంలో తరచుగా ఉద్యోగులకు ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి వీలవుతుందని బౌలెట్ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube