ప్రజల ఆస్తుల్ని సొంత పార్టీకి దోచిపెడుతున్న సర్కార్..

అధికారంలో ఉన్నవారు సొంత పార్టీలకు ప్రజల ఆస్తులు దోచిపెట్టవచ్చా? ప్రభుత్వ ఆస్తులను కాపాడతామని ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినవారు.విచ్చలవిడిగా జీవోలు జారీ చేయవచ్చా? ఇక్కడ తన దోపిడీకి అడ్డం రాకుండా అన్ని పార్టీలను కలుపునే ప్రయత్నం కూడా చేసింది తెలంగాణ రాష్ట్ర సమితి.టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా కార్యాలయానికి భూమి కేటాయింపు వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపింది.దళితులకు మూడు ఎకరాలు ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్…ఆ తర్వాత భూములు లేవని ప్రకటించేశారు.

 Government Plundering People's Property For Its Own Party, Trs Party , Ts Poltic-TeluguStop.com

పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించి ఇస్తామని 8 ఏళ్లుగా ఊరిస్తూనే ఉన్నారు గాని ఎక్కడా ఇచ్చింది లేదు.పూర్తయినవాటిని కూడా కేటాయించకపోవడంతో.అవి శిధిలావస్థకు చేరుకుంటున్నాయి.టీఆర్ఎస్ సర్కార్.

కాని రాజకీయ పార్టీల ఆఫీసులకు భూములు ఇవ్వడానికి ఉదారంగా నిర్ణయం తీసుకుంది.నాలుగేళ్ళ నాడు అన్ని రాజకీయ పార్టీలకు జిల్లా కేంద్రాల్లో స్థలాలు ఇవ్వడానికి జీవో జారీ చేసింది.

ఎకరం లోపు స్థలం గజం వంద రూపాయలకే ఇవ్వడానికి జీవో జారీ చేసింది.జిల్లా కేంద్రాల్లో స్థలం ఖరీదు ఎంత ఎక్కువున్నా…వంద రూపాయలకే ఇచ్చేస్తారు.ఇప్పటికే 24 జిల్లాల్లో 18.5 ఎకరాల భూమిని 89 లక్షలకే టీఆర్ఎస్ తీసుకుంది.వీటి మార్కెట్ విలువ వంద కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని సమాచారం.టీఆర్ఎస్ నాయకులు పార్టీ ఆఫీసులకు స్థలాలు కావాలని అర్జీ పెట్టుకోవడం, టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే స్థలాలు కేటాయించడం ఒక ప్రహసనంలా జరుగుతోంది.2018 ఆగస్టులో ఇచ్చిన జీవో వల్ల ఇతర పార్టీలు ఎంత వరకు లాభపడ్డాయో తెలియదు గాని.టీఆర్ఎస్ మాత్రం భారీగా లబ్ది పొందింది.

తాను కోరుకున్న చోట అన్ని జిల్లాల్లో భూముల్ని గజం వంద రూపాయలకే కబ్జా చేసేసింది.అవన్నీ ఒక ఎత్తయితే…హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన ప్రాంతం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో గజం వంద రూపాయలకే తన పార్టీకి స్థలం కేటాయించేసుకుంది.

వంద కోట్లకు పైగా విలువైన 4,935 గజాల స్థలం టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా ఆఫీస్కు ప్రభుత్వం ఎలాట్ చేసింది.ఇప్పుడు దీనిపైనే విపక్షాలన్నీ విమర్శల బాణాలు ఎక్కు పెట్టాయి.

Telugu Bandi Sanjay, Banjara Hills, Bjp, Hyderabad, Revanth Reddy, Trs, Ts Polti

టీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే ప్రభుత్వ భూములన్నీ కబ్జా చేసేస్తున్నారు.అవే కాకుండా అధికారికంగా ప్రభుత్వమే టీఆర్ఎస్ కు దోచి పెడుతోందని విమర్శిస్తున్నారు.దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని ఆ హామీని తుంగలో తొక్కారు.పేదల ఇళ్ళ నిర్మాణం పూర్తిగా పడకేసింది.ఖజానాలో డబ్బుల్లేక ప్రభుత్వ భూములు అమ్మేసుకుంటున్నారు.ఈ పరిస్థితుల్లో అత్యంత ఖరీదైన భూమి టీఆర్ఎస్ తీసుకోవడం అంటే ప్రజల ఆస్తులను లూటీ చేయడమే అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube