కాటికి కాళ్ళు చాపుకున్న వృద్దులకు రూ. 3000 ఇవ్వడం సమంజసమేనా... ?

ప్రస్తుత కాలంలో కొందరు స్వార్థ రాజకీయ నాయకులు ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలనే నెపంతో ఓట్ల కోసం ప్రజలకు అవసరం లేని పథకాలను ప్రవేశపెడుతూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.అయితే ఇందులో ముఖ్యంగా ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి యువతను గాలికి వదిలేసి, కాటికి కాళ్ళు జాపుకొని 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకి ప్రభుత్వం 2500 రూపాయలు నుంచి 3 వేల రూపాయలు పింఛను ప్రకటించడం ఎంత వరకు సమంజసమని కొందరు యువత ప్రభుత్వ అధికారులని ప్రశ్నిస్తున్నారు.

 Three Thousand Pension To Old People,government Pension, 60 Years Old Age People-TeluguStop.com

ఇలా చేయడం వల్ల కొంతమంది కొడుకులు, కూతుర్లు తమ తల్లిదండ్రులను చూసుకునే స్తోమత ఉన్నప్పటికీ ప్రభుత్వ పెన్షన్ లపై ఆధారపడే విధంగా చేస్తున్నారని దీనివల్ల కొంతమేర మానవ సంబంధాలపై కూడా చెడు ప్రభావం చూపుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి ప్రతి విద్యార్థికి యూనిఫాం దుస్తులు, బూట్లు, భోజనం, తదితర వసతులను కల్పిస్తూనే అదనంగా ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి 15 వేల రూపాయలు ఇవ్వడం సరికాదని అంటున్నారు.

ఇలా చేయడం వల్ల కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ ఇచ్చేటువంటి 15 వేల రూపాయలు తీసుకొని ప్రైవేటు పాఠశాలలో చేర్పిస్తున్నారని, కాబట్టి సంవత్సరానికి ఒక్కో విద్యార్థికి 15 వేల రూపాయలు ఇచ్చే బదులుగా వారికి ప్రభుత్వ పాఠశాలల్లోనే సరైన వసతులు కల్పించి మెరుగైన విద్య ను అందించేందుకు ప్రయత్ని ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందవచ్చునని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరి ఈ విషయంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube