ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ లో బ‌దిలీల జోరు.. ఈట‌ల‌ను దెబ్బ‌తీసేందుకేనా..?

కరీంనగర్ జిల్లా రాజకీయాలు మొత్తం హుజూరాబాద్ ఉప ఎన్నికల చుట్టారా తిరుగుతున్నాయి.తాజాగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా విధులు నిర్వర్తిస్తున్న కమలాసన్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేయడం వెనుక హుజూరాబాద్ ఉప ఎన్నికే కారణమని చాలా మంది భావిస్తున్నారు.

 Government Officers Transfers In Karimnagar Is It Against Etela Rajender Huzurabad Elections-TeluguStop.com

హుజూరాబాద్ ఏసీపీగా పని చేసిన శ్రీనివాస రావు బదిలీతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బదిలీల పర్వం మొదలైంది.అనంతరం ఒక్కొక్కరుగా హుజూరాబాద్ నియోజకర్గానికి చెందిన సీఐలు, ఎస్సైలను బదిలీ చేస్తూ వచ్చారు.

అనంతరం మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లను ఎవరినీ వదలలేదు.ప్రస్తుతం ఈ బదిలీలు ఉన్నత స్థాయి అధికారుల వరకు చేరుకుంది.

 Government Officers Transfers In Karimnagar Is It Against Etela Rajender Huzurabad Elections-ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ లో బ‌దిలీల జోరు.. ఈట‌ల‌ను దెబ్బ‌తీసేందుకేనా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వారం కింద కలెక్టర్ శశాంకను బదిలీ చేయగా.తాజాగా పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డిని కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

పైగా అతడికి ఇంకా ఎక్కడ కూడా పోస్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం.

ఈ బదిలీలలకు కారణం ఎలాగైనా సరే హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో గెలవడం కోసమే అని పలువురు చర్చించుకుంటున్నారు.

టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను ఓడించుకునేందుకు ఇప్పటికే అనేక మంది ఇతర పార్టీల వారిని కారెక్కించుకుంటున్న గులాబీ అధిష్టానం అధికారులను కూడా బదిలీ చేస్తుందని ఆరోపిస్తున్నారు.అంతే కాకుండా ఓ కీలక అధికారి బదిలీ వెనుక చాలా పెద్ద కథ నడిచిందని చెప్పుకుంటున్నారు.

Telugu Bjp, Collector Sashanka, Etela Rajender, Government Officers Transfers, Huzurabad, Huzurabad By Poll, Huzurabad Elections, Karimnagar, Kcr, Police Commissioner Kamalasan Reddy, Trs-Telugu Political News

పథకాలే కాకుండా అధికారుల బదిలీలపై కూడా టీఆర్ఎస్ దృష్టి సారించిందని అంటున్నారు.ఇంకా హుజూరాబాద్ నియోజకవర్గానికి అసలు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక మునుపే ఇన్ని బదిలీలు జరిగితే ఇంకా ఎన్నికల సమయం వరకు ఎంత మందిని బదిలీ చేస్తారో అని కరీంనగర్ జిల్లా వాసులు చర్చించుకుంటున్నారు.మరో విషయం ఏంటంటే కమలాసన్ రెడ్డి నేతృత్వంలో కరీంనగర్ కమిషనరేట్ పోలీసలు అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచారు.

#Karimnagar #Etela Rajender #Huzurabad #Kamalasan #Sashanka

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు