మహారాష్ట్ర బాటలోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం..!!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితి దారుణంగా ఉంది.మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు ఊహించని విధంగా బయటపడటం మాత్రమే కాక దేశంలో సగానికిపైగా కొత్త కేసులు ఇక్కడే నమోదు అవుతున్నాయి.

 Government Of Uttar Pradesh On The Way To Maharashtra Lock Down,uttar Pradesh,-TeluguStop.com

దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం వీకెండ్ లాక్ డౌన్ అమలు చేస్తూ రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ ఉన్నాయి.అయినా కానీ కేసులు పెరుగుతూ ఉండటంతో కోవిడ్ టాస్క్ ఫోర్స్ రాష్ట్రంలో 15 రోజుల పాటు లాక్డౌన్ అమలు చేస్తే బాగుంటుందని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకి సూచించారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు మహారాష్ట్ర బాటలోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా వ్యవహరించటానికి రెడీ అవుతుంది.యూపీలో ఇటీవల భారీగా వైరస్ విజృంభణ ఉండటంతో అక్కడి రాష్ట్రప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ డిసైడ్ అయ్యారు.

ఐదు వందల కంటే ఎక్కువ కేసులు ఉన్న జిల్లాలలో కర్ఫ్యూ విధించాలి అని కోరారు.ఇప్పటికే విద్యాసంస్థల తో పాటు కోచింగ్ సెంటర్లని క్లోజ్ చేసిన యూపీ సర్కార్ ప్రధాన నగరాలలో నైట్ కర్ఫ్యూ విధిస్తూ ఉన్నారు.

మహారాష్ట్ర, యూపీ రాష్ట్రాలలో మాత్రమేకాక తెలుగు రాష్ట్రాల చుట్టుపక్కల ప్రాంతాలలో భారీ స్థాయిలో వైరస్ విజృంభన ఉంది. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube