అలాంటి యాప్స్ డౌన్ లోడ్ చేయొద్దని హెచ్చరిస్తున్న కేంద్రం?

ఈ మధ్య కాలంలో సైబర్ మోసగాళ్లు కొత్త రూట్లను ఎంచుకుంటున్నారు.మాయమాటలు చెప్పి అమాయకుల మొబైల్స్ లో థర్డ్ పార్టీ యాప్స్ డౌన్ లోడ్ చేయించి మోసాలకు పాల్పడుతున్నారు.

 Government Of India Warns Users Against Downloading These Kind Of Apps, Governam-TeluguStop.com

ప్రతిరోజూ దేశంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో పదుల సంఖ్యలో ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి.మనం చేసే చిన్నచిన్న తప్పులే మోసపోవడానికి కారణమవుతున్నాయి.

మోసగాళ్లు ఎక్కువగా మనం ఆసక్తి చూపే యాప్స్ కు ఫేక్ యాప్స్ క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు.

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో చాలామంది ఆక్సీమీటర్‌ యాప్‌లపై ఆసక్తి చూపిస్తున్నారు.

గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి ఆక్సీమీటర్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే ఎటువంటి సమస్య లేదు కానీ గుర్తుతెలియని యూఆర్‌ఎల్‌ల నుంచి డౌన్ లోడ్ చేసుకుంటే మాత్రం ప్రమాదం బారిన పడినట్టే.సాధారణంగా ఆక్సీ మీటర్ యాప్స్ ద్వారా ఆక్సిజన్ లెవెల్స్, హార్ట్ బీట్, ఆక్సిజన్ అందని ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచనలు చేస్తాయి.

అయితే ఫేక్ ఆక్సీమీటర్ యాప్స్ మన మొబైల్ లోని ఇతర యాప్స్, సమాచారం, చాట్, ఇతర విషయాలను హ్యాకర్లకు చేరేలా చేస్తుంది.మొబైల్ లోని యూపీఐ అకౌంట్ల వివరాలు, సోషల్ మీడియా అకౌంట్లకు సంబంధించిన పాస్ వర్డ్ లు అన్నీ హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతాయి.

కేంద్రం యూఆర్‌ఎల్‌ల నుంచి మెసేజ్ ల రూపంలో వచ్చే యాప్స్ ను నమ్మవద్దని.ఇలాంటి యాప్స్ వల్ల వ్యక్తిగత సమాచారంతో పాటు బయోమెట్రిక్ సమాచారాన్ని కూడా తస్కరించే అవకాశం ఉందని తేలింది.

ఆరోగ్య శాఖాధికారులు కరోనా లక్షణాలు కనిపించినా, కరోనా నిర్ధారణ అయినా ఆక్సిజన్ లెవెల్స్ ను చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.సాధారణంగా ఆక్సీమీటర్లు మెడికల్ షాప్స్ లోనూ, ఈ కామర్స్ వెబ్ సైట్లలోనూ లభిస్తుంటాయి.

ఆక్సిజన్ లెవెల్స్ తెలుసుకోవడానికి యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకోవడం కంటే వాటిని కొనుక్కోవడం ఉత్తమమని కేంద్రం సూచిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube