ట్విట్టర్ పై చర్యలు తీసుకోబోతున్న భారత ప్రభుత్వం..?!

ఇప్పుడు ఎవరు చూసినాగాని ట్విటర్ వేదికగా వారు చెప్పాలనుకుంటున్న విషయాన్నీ తెలియచేస్తున్నారు.ఈ ట్విట్టర్ లో చేస్తున్న పోస్ట్ లు కారణంగా కొంతమంది ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

 Government Of India To Take Action On Twitter  Government Of India,  Twitter, In-TeluguStop.com

ఈ మధ్యన దేశ వ్యాప్తంగా రైతులు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పుడు చాలావరకు ట్విట్టర్ అకౌంట్ లు ఆటోమేటెడ్ బోట్స్ రూపంలో ఉన్నాయి.

ఈ అకౌంట్స్ రైతుల నిరసనలను రెచ్చగొట్టేలా ఉండే కంటెంట్ ను ప్రజలకు చేరవేసే క్రమంలో ఉన్నాయని ప్రభుత్వం భావిస్తుంది.అందుకనే ఈ ట్విట్టర్ వ్యవహారంపై కేంద్రం సీరియస్ అవుతున్నట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే కేంద్రం మన దేశీ ట్విటర్ అయిన కూ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.ఈ ట్విట్టర్ మన మేడిన్ ఇండియా ట్విటర్ అవ్వడం గమనార్హం.

ఇప్పుడు ఈ ప్లాట్ ఫామ్‌లో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో పాటు వీటికి అనుబంధంగా ఉన్న మరిన్ని సంస్థలు తమ సోషల్ మీడియా ఖాతాలను దేశీయ ట్విట్టర్ కి మార్చుకున్నాయి.

ఓ రిపోర్టు ప్రకారం ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖతో బాటు డిజిటల్ ఇండియా, ఇండియా పోస్ట్, ఎన్ఐసీ, సమీర్, కామన్ సర్వీసెస్ సెంటర్, ఉమంగ్ యాప్ డీజీ లాసర్ తదితర సంస్థలకు చెందిన అకౌంట్లను వెరిఫై చేసిన తర్వాత ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా కూ ను తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోంది.

అలాగే మన భారత దేశానికీ వ్యతిరేకంగా చేస్తున్న పోస్టులను తొలగించాలన్న తమ ఉత్తర్వులను పాటించడంలో ట్విట్టర్ విఫలమైనది అందుకనే ట్విటర్ పై చర్య తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది.

అందుకు ప్రత్యామ్నాయంగా దేశీయ ట్విట్టర్కూపై కేంద్రం ఫోకస్ చేస్తుందని తెలుస్తుంది.

అంతేకాకుండా భారత దేశానికీ వ్యతిరేకంగా పోస్ట్ లు పెడుతున్న ఖలిస్తానీ సానుభూతిపరులు, పాకిస్థాన్ మద్దతుదారులు,విదేశీ వ్యక్తుల ట్విట్టర్ ఖాతాలను బ్లాక్ చేయాలని కేంద్రం ఆదేశించింది.అలాగే రైతుల ఆందోళనలపై కొంతమంది విదేశీ సెలబ్రిటీలు పెట్టిన పలు పోస్టులకు ట్విటర్ సీఈఓ జాక్ డోర్సే మద్దతు ప్రకటించారు.

భారత దేశానికీ సంబంధించి వ్యతిరేక పోస్టులను సమర్థిస్తూ వస్తున్న ఆయన వ్యాఖ్యలను కూడా ప్రభుత్వ పరిగణలోకి తీసుకుంది.విదేశి సెలబ్రిటీ అయిన పాప్ సింగర్ రిహానా ట్వీట్స్ ను ఆయన లైక్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube