వాట్సాప్ కి పోటీ గా కొత్త యాప్ లాంచ్ చేసిన భారత ప్రభుత్వం..!

ఈ కాలంలో ప్రతి ఒక్కరి చేతిలోనూ ముందుగా మనం చూసే వస్తువు ఏదన్నా ఉంది అంటే అది స్మార్ట్ ఫోన్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.అలాగే స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఫోన్ లో ముందుగా వాడే యాప్ ఏదన్నా ఉంది అంటే అది ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్‌.

 Government Of India Launches New App To Compete With Whatsapp, Whats App, Swades-TeluguStop.com

మన దేశంలో చాలామంది ఈ వాట్సాప్ ను వాడుతున్నారు.అయితే ఇప్పుడు వాట్సప్ కి పోటీగా మన భారత ప్రభుత్వం ఒక కొత్త యాప్ ని ప్రవేశపెట్టనుంది.

నూతనంగా ” సందేశ్ ” అనే యాప్ ను వాట్సాప్ కి పోటీగా లాంచ్ చేసింది.

అయితే వాట్సాప్‌లో ఉన్న అన్ని ఫీచర్లతోపాటు అదనంగా మరి కొన్ని కొత్త ఫీచర్లను కూడా ఈ యాప్‌లో అందిస్తున్నారు.

ఈ యాప్‌ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ తాజాగా ఆవిష్కరించింది.అలాగే ఎవరయితే సందేశ్ యాప్‌ వాడతారో వాళ్ళ యొక్క డేటాకు పూర్తి రక్షణ ఉంటుంది.ఎందుకంటే ఈ యాప్ ని కనిపెట్టింది మన భారత దేశమే కాబట్టి ఇందులో స్టోర్ అయ్యే డేటా అంతా మన ఇండియాలోనే ఉంటుంది.

Telugu Alterante, Compete, Indian, Sandes App, Swadesi App, Whats App-Latest New

ఇకపోతే వాట్సాప్ లో లేని ఫీచర్స్ సందేశ్ యాప్‌లో ఏమున్నాయంటే… బర్త్ డే, ప్రొఫెషనల్ వివరాలను ఎంటర్ చేయవచ్చు.  ఫోన్ నంబర్ లేకుండా కూడా సందేశ్ యాప్‌ను వాడవచ్చు.కేవలం ఈ-మెయిల్ తో ఈ యాప్ వాడుకోవచ్చు.

అలాగే ఒకటికన్నా ఎక్కువ డివైస్‌లలో సందేశ్ యాప్‌ను ఉపయోగించవచ్చు.అలాగే చాట్ బాట్, లాగౌట్ ఫీచర్లను కూడా సందేశ్ యాప్ లో అందిస్తున్నారు.

ఇక వాట్సాప్‌లో ఉన్న బ్రాడ్ క్యాస్ట్ మెసేజెస్‌, గ్రూప్స్, ఇమేజ్‌ల షేరింగ్‌, వీడియో, ఎమోజీలు వంటి ఫీచర్లన్నీ సందేశ్ యాప్‌లోనూ లభిస్తున్నాయి.  మరి ఈ యాప్ వాట్సాప్ కి గట్టి పోటీగా నిలవనుందా.

లేదా అనేది వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube