10 మొక్కలు నాటితే తుపాకీ లైసెన్స్.. ఎక్కడంటే?

ఏంటి టైటిల్ చూడగానే… మొక్కలు నాటితే తుపాకీ కి లైసెన్స్ ఇవ్వడమేంటి అనే అనుమానం వచ్చింది కదా… వచ్చే ఉంటుంది…ఎందుకంటే మొక్కల కి తుపాకికి ఎలాంటి సంబంధం ఉండదు కాబట్టి… కానీ ఇది మాత్రం నిజమే నండోయ్, పది మొక్కలు నాటితే చాలు ఏకంగా తుపాకీకి లైసెన్స్ ఇస్తామంటూ పంజాబ్ ప్రభుత్వం చెబుతోంది.

 Government, Gun, Licensed, Ten Plants, Planted-TeluguStop.com

ఇదేదో బాగుందే అని అనుకుంటున్నారు కదా… కానీ ఇది అంత ఈజీ కాడండోయ్.

ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే వివరాల్లోకి వెళ్ళాల్సిందే మరి.పంజాబ్ లోని పాటియాలా జిల్లా యంత్రాంగం ఒక సరికొత్త ఆలోచన చేసింది.మొక్కలు నాటిన వారికి గన్ లైసెన్స్ ఇస్తాము అంటూ సంచలన ప్రకటన చేసింది.ప్రజలు గన్ లైసెన్స్ పొందాలి అంటే 10 మొక్కలు నాటాలి అంటూ ఓ సరి కొత్త నిబంధన తెర మీదకు తీసుకు వచ్చింది.

పచ్చదనాన్ని పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

అయితే కేవలం మొక్కలు నాటి వదిలేయడం కాదు మొక్కలు నాటి నెల రోజుల పాటు క్రమం తప్పకుండా నీళ్లు పోసి ఎదుగుదలకు తగిన చర్యలు తీసుకొని వాటిని సంరక్షించి.

వాటి తో ఫోటో దిగాలి ఇవన్నీ జరిగిన తర్వాతనే తుపాకి లైసెన్స్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.తలుచుకుంటే కాస్త కష్టమే అనిపిస్తుంది కదా.అయితే కాస్త కష్టమైనప్పటికీ తుపాకి లైసెన్స్ అనడంతో ప్రస్తుతం చాలామంది ఇలా మొక్కలు నాటడానికి ముందు వస్తున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube