థియేటర్స్ లో ఆక్యుపెన్సీ పెంపుకి కేంద్రం గ్రీన్ సిగ్నల్

లాక్ డౌన్ నుంచి బయటపడిన తర్వాత థియేటర్లు ఓపెన్ చేయడానికి కేంద్రం పర్మిషన్ ఇవ్వడానికి రెండు నెలలు తీసుకుంది.పర్మిషన్ ఇచ్చినా కూడా కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్స్ రన్ చేసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

 Government Green Signal To Increase Theatres Occupancy, Tollywood, South Cinema,-TeluguStop.com

అయితే 50 శాతం ఆక్యుపెన్సీతో పెద్ద సినిమాలు రిలీజ్ చేస్తే నష్టపోయే అవకాశాలు ఉన్నాయని నిర్మాతలు ముందుగా భావించారు.అలాగే కరోనా భయంతో ప్రేక్షకులు థియేటర్స్ కి ఎంత వరకు వస్తారనే విషయంలో కూడా సందేహం ఉండేది.

అయితే తెలుగులో సోలో బ్రతుకే సో బెటరు సినిమా అన్నిటికంటే ముందుగా థియేటర్స్ లోకి వచ్చింది.ఇక సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

ఇక అదే ధైర్యంతో సంక్రాంతి సినిమాలు సందడి చేశాయి.వీటిలో క్రాక్ సినిమాకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని 50 శాతం ఆక్యుపెన్సీతోనే అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకుంది.ఇక కోలీవుడ్ లో కూడా విజయ్ మాస్టర్ మూవీ 50 శాతం ఆక్యుపెన్సీతోనే 200 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుంది.

ఈ నేపధ్యంలో నిర్మాతలకి, థియేటర్స్ యజమానులుకి ఇప్పుడు సినిమా రిలీజ్ ల విషయంలో ఉన్న భయాలు పోయాయి.ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం థియేటర్స్ యజమానులుకి, నిర్మాతలకి శుభవార్త చెప్పింది.

ఫిబ్రవరి 1 నుంచి థియేటర్స్ ఆక్యుపెన్సీ పెంచుకోవచ్చని తెలియజేసింది.ఇది ఓ విధంగా సినిమా మీద ఆధారపడి బ్రతుకుతున్న అందరికి శుభవార్త అని చెప్పాలి.

కరోనా తగ్గుముఖం పట్టడంతో పాటు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ షురూ అయ్యింది.ఇదే సమయంలో ప్రజలలో ఉన్న కరోనా భయం కూడా పోయింది.

దీంతో కేంద్రం అన్ని ఆలోచించి కొన్ని షరతులతో థియేటర్స్ ఆక్యుపెన్సీ పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube