నవ్య ఆస్పత్రిని సీజ్ చేసిన ప్రభుత్వం

కరోనా వ్యాప్తి సమయంలో కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులు జులూం ప్రదర్శిస్తున్నాయి.తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు కనికరం చూపకుండా డబ్బులు గుంజుకుంటున్నారు.

 Nalgonda, Navya Hospital, Siezed-TeluguStop.com

కరోనా సమయంలో ఆస్పత్రిలో జాయిన్ అవుతున్న బాధితుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు.ప్రభుత్వం నిబంధనలు జారీ చేసినా కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో మార్పు రావడం లేదు.

డబ్బులు సంపాదించే ఆలోచనలో ఆస్పత్రుల యాజమాన్యాలు చికిత్సకు రేటును పెంచి క్యాష్ చేసుకుంటున్నారు.

ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీలపై ప్రభుత్వానికి రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి.

ఈ మేరకు నల్గొండ జిల్లా నవ్య ఆస్పత్రిపై కూడా ఆరోపణలు వచ్చాయి.జిల్లాకు చెందిన ఓ బాధితుడు కరోనా చికిత్స కోసం ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు.

అయితే ఆయన 12 రోజులు వరకు చికిత్స చేయించుకున్నాడు.దానికి గానూ నవ్య ఆస్పత్రి సిబ్బంది చికిత్సకు రూ.6 లక్షలు వసూలు చేశారని ఆరోపణలు వినిపించాయి.బాధితుడు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో ఆరోపణలపై విచారణ జరిపిన డీఎంహెచ్ఓ ఆరోపణలు నిజమని తేలింది.

ఈ మేరకు అధికారులతో కలిసి నవ్య ఆస్పత్రిని సీజ్ చేశారు.అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.

కరోనా బారిన పడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవడానికి వచ్చిన వారి నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube