సింగపూర్ వెళ్లొద్దు అంటూ కేంద్రం సూచన,కరోనా నే కారణమా  

Government Asks Citizens To Avoid Non-essential Travel To Singapore - Telugu Chaina Hong Kong And Thailand, Corona Virus In Chaina, , India To Singapoore, Indonesia, Khatmandu, Malasiya, Singapore

గత కొద్దీ రోజులుగా కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే.ఎప్పుడు ఎక్కడ ఈ కరోనా వైరస్ సోకుతుందో ఎవరు ఈ కరోనా కు బలవుతారో అని ప్రతి దేశం తమ ప్రజల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది.

Government Asks Citizens To Avoid Non-essential Travel To Singapore

ఇప్పటికే ఈ కరోనా వైరస్ బారిన పడి డ్రాగన్ దేశంలో చైనా లో దాదాపు 2 వేల మందికి పైగా మృతి చెందారు.ఈ నేపథ్యంలో భారత్ కూడా వివిధ దేశాలకు విమాన సర్వీసులను కూడా రద్దు చేసింది.

తాజాగా సింగపూర్ కు వెళ్లొద్దు అంటూ కేంద్రం మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.అత్యవసరం అనుకుంటే తప్ప ఎవరూ కూడా సింగపూర్ వెళ్లొద్దు అంటూ సూచనలు చేసినట్లు తెలుస్తుంది.

అలాగే మరోపక్క దేశంలోకి కరోనా వైరస్ రాకుండా ఉండేందుకు కూడా కేంద్రం చర్యలు చేపట్టింది.కట్మాండు, ఇండోనేసియా, వియత్నాం, మలేసియా నుంచి మన దేశానికి వచ్చే ప్రయాణికులను ఎయిర్ పోర్టు లోనే స్క్రీనింగ్ చేయడానికి తగిన చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది.

సోమవారం నుంచి స్క్రీనింగ్ పనులు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.ఈ మేరకు క్యాబినెట్ సెక్రటరీ అధ్యక్షతన శనివారం నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ప్రస్తుతం చైనా, హాంకాంగ్, థాయ్ లాండ్ , దక్షిణ కొరియా, సింగపూర్, జపాన్ నుంచి వచ్చే వారిని 21 ఎయిర్ పోర్టుల్లో స్క్రీనింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పుడు తాజాగా కాట్మండు, ఇండోనేషియా,వియత్నాం,మలేసియా నుంచి వచ్చే ప్రయాణికులపై కూడా స్క్రీనింగ్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

తాజా వార్తలు

Government Asks Citizens To Avoid Non-essential Travel To Singapore-corona Virus In Chaina,india To Singapoore,indonesia,khatmandu,malasiya,singapore Related....