విశాఖ రైల్వే జోన్ ఓఎస్డీగా శ్రీనివాస్ నియామకం!

ఎన్నికల నోటిఫికేషన్ కి ముందు కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ ఏపీలో విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే.మూడు దశాబ్దాల నుంచి ఉత్తరాంద్రలో విశాఖ రైల్వేజోన్ గురించి పోరాటం నడుస్తుంది.

 Government Appointed Osd For Vizag Railway Zone-TeluguStop.com

అయితే గత ఎన్నికలలో విభజన హామీలలో విశాఖ రైల్వే జోన్ అంశం మళ్ళీ తెరమీదకి వచ్చింది.బీజేపీ పార్టీ కూడా రైల్వే జోన్ ఇస్తానని మాట ఇచ్చింది.

అయితే అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు అయిన విభజన హామీలలో వున్నా రైల్వే జోన్ అమలు చేయకపోవడంతో ఏపీలో బీజేపీపై కొంత వ్యతిరేకత వచ్చింది.

ఇదిలా వుంటే ఊహించని విధంగా బీజేపీ ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ ని ప్రకటించి దక్షిణ కోస్తా రైల్వే జోన్ గా నామకరణం కూడా చేసింది.

అయితే రైల్వే జోన్ లో వాల్తేర్ డివిజన్ ని తీసేసి దానిని రాయఘడ్ డివిజన్ గా మార్చేయడంపై ఏపీలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది.అత్యధిక ఆదాయం వచ్చి, చారిత్రాత్మక వాల్తేర్ డివిజన్ ని విశాఖ రైల్వే జోన్ నుంచి తప్పించడంపై టీడీపీ పార్టీతో పాటు, ఉద్యమ నాయకులు కూడా నిరసన తెలియజేసారు.

ఇదిలా వుంటే విశాఖ రైల్వే జోన్ కోసం డీపీఆర్, భూసేకరణ, విధి విధానాల రూపకల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ఓఎస్డీని నియమించింది.ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్ 1990 బ్యాచ్ కి చెందిన శ్రీరంగం శ్రీనివాస్ ని ఓఎస్డీగా నియమించింది.

తాజాగా ఆయన బాధ్యతలు కూడా స్వీకరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube