శాతకర్ణి షూటింగ్లో జార్జియన్ ఫోక్స్ సాంగ్స్ సందడి...!

నందమూరి నట సింహం బాలకృష్ణ వందవ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి షూటింగ్ మూడో షెడ్యూల్ జార్జియాలో శరవేగంగా జరుగుతుంది.అయితే షెడ్యూల్ స్టార్ట్ చేసినప్పటి నుండి మొత్తం యుద్ధాలతో అలసిపోతున్న చిత్రయూనిట్ కు ఊరటనిచ్చేలా సినిమాలో పనిచేస్తున్న జార్జియా జూనియర్ ఆర్టిస్ట్ లతో ఫోక్ సాంగ్స్ తో హుశారైన డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారట.

 Gouthami Putra Shathakarni Team Enjoy With Folk Songs-TeluguStop.com

సినిమా స్టార్ట్ అయిన నాటి నుండి చిత్రయూనిట్ అంతా కష్టపడుతున్న కారణంగా కాస్త వారిలో ఉత్సాహం నింపేందుకు ఈ కార్యక్రమం అరేంజ్ చేయడం జరిగింది.

ఇక భాష ఏదైనా ఫోక్ సాంగ్స్ కు ఉండే స్పెషల్ అందరికి తెలిసిందే.

సరదాగా ఆటపాటలతో చిత్రయూనిట్ అంతా భలే ఎంజాయ్ చేశారని తెలుస్తుంది.ఇక జరుగుతున్న మూడో షెడ్యూల్ తో సినిమాలోని వార్ సీన్స్ అన్ని ముగుస్తాయట.

హైదరాబాద్ తిరిగి వచ్చాక మిగిలిన షూటింగ్ చేస్తారట.ఈ మధ్యే గౌతమిపుత్ర శాతకర్ణి డైరక్టర్ క్రిష్ ఎంగేజ్ మెంట్ అయ్యింది.

ఈ శ్రావణమాసంలోనే పెళ్లి కూడా ఉంటుందట.కాబట్టి క్రిష్ పెళ్లి కోసం సినిమాకు కొద్ది రోజులు బ్రేజ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube