రామ్‌ చరణ్ తో అనుకున్న కథను రౌడీ స్టార్‌ వద్దకు తీసుకు వెళ్లాడా?

నాచురల్‌ స్టార్‌ నాని తో జెర్సీ సినిమా ను తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ ఒక సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.ఆ సినిమా షూటింగ్‌ అదుగో ఇదుగో అంటూ వాయిదా పడ్డింది.

 Goutham Thinnanuri New Movie With Vijay Devarakonda-TeluguStop.com

చివరకు అసలు గౌతమ్‌ తిన్ననూరితో చరణ్‌ మూవీ లేదని తేల్చేశారు.రామ్‌ చరణ్‌ ప్రస్తుతం ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా ను చేస్తున్నాడు.

ఆ తర్వాత వెంటనే శంకర్‌ దర్శకత్వంలో ఒక సినిమా ను చేసేందుకు ఓకే చెప్పాడు.కనుక గౌతమ్‌ తో సినిమా ఇప్పట్లో సాధ్యం కాదని తేలిపోయింది.

 Goutham Thinnanuri New Movie With Vijay Devarakonda-రామ్‌ చరణ్ తో అనుకున్న కథను రౌడీ స్టార్‌ వద్దకు తీసుకు వెళ్లాడా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దాంతో గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా ను చరణ్‌ పూర్తిగా వదిలేసినట్లుగా ఉన్నాడు.చరణ్‌ నో చెప్పడంతో ఆ ప్రాజెక్ట్‌ ను మెల్లగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వద్దకు తీసుకు వెళ్లాడనే వార్తలు వస్తున్నాయి.

విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా చిత్రంగా రూపొందించేందుకు దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి ఏర్పాట్లు చేస్తున్నాడు.ప్రస్తుతం జెర్సీ రీమేక్ ను హిందీ లో తెరకెక్కిస్తున్న దర్శకుడు గౌతమ్‌ ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో సినిమా ను మొదలు పెట్టబోతున్నాడు.

చరణ్‌ కు ఏ కథను అయితే చెప్పాడో అదే కథతో విజయ్ దేవరకొండతో సినిమా ను చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుందట.

Telugu Film News, Goutham And Vijay Combo Movie, Goutham Thinnanuri, Jersey Movie Director, Ram Charan, Script Work, Tollywood, Vijay Devarakonda-Movie

అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది ఆరంభం లో వీరి కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.జెర్సీ సినిమా తో ఏకంగా జాతీయ అవార్డును దక్కించుకున్న గౌతమ్‌ ఈ సినిమా ను కూడా అదే రేంజ్‌ లో రూపొందించబోతున్నాడని అంటున్నారు.త్వరలోనే విజయ్‌ దేవరకొండ మరియు గౌతమ్‌ తిన్ననూరిల కాంబో మూవీ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

#JerseyMovie #Script Work #Ram Charan #GouthamAnd

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు