యుట్యూబ్ చానల్ స్టార్ట్ చేసిన సూపర్ స్టార్ కూతురు  

Mahesh Babu Daughter Sitara And Friend Launch New Channel-

స్టార్ హీరోలైన వారి పిల్ల క్రియేటివిటీని ప్రోత్సహించడంలో చాలా మంది ముందు ఉంటారు.ఆ వరుసలో మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడు అందరికంటే ముందు ఉంటాడు.తన పిల్లలకి కావాల్సినంత ఫ్రీడం ఇచ్చే మహేష్ బాబు వారిని ప్రతి ఏడాదికి నచ్చిన చోటికి తీసుకెళ్ళి బెస్ట్ ఫాదర్ కూడా నిపించుకున్నాడు..

Mahesh Babu Daughter Sitara And Friend Launch New Channel--Mahesh Babu Daughter Sitara And Friend Launch New YouTube Channel-

ఖాళీ సమయం దొరికితే పిల్లలతో స్పెండ్ చేయడానికి ఆసక్తి చూపించే మహేష్ బాబు వారిలో టాలెంట్ ని కూడా ప్రోత్సహిస్తూ ఉంటాడు.అ న్దులో భాగంగానే కొడుకుని ఇప్పటికే నటుడుగా పరిచయం చేసాడు.ఇదిలా ఉంటే తన కూతురు సితారాలో టాలెంట్ ని అందరికి చూపించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు.

సితార ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో టిక్ టాక్ లో సాంగ్స్ పాడుతూ, అల్లరి చేస్తూ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి.సెలబ్రిటీ కూతురు కావడంతో ఆమె ఏం చేసిన ఫాన్స్ ఇష్టపడి చూస్తారు.ఈ నేపధ్యంలో తాజాగా ఏ అండ్ ఎస్ పేరుతో దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తెతో కలిసి సితారా యుట్యూబ్ చానల్ ఏర్పాటు చేసింది.

ఇందులో ‘ఏ’ అంటే ఆద్య,ఇక ‘ఎస్’ అంటే సితార.ఆద్య, సితార మంచి ఫ్రెండ్స్ కావడంతో తమ పేర్లలోని మొదటి అక్షరాలతో ఏ అండ్ ఎస్ యూట్యూబ్ చానల్ ప్రారంభించారు.ఇందులో మొదటి వీడియోగా ‘3 మార్కర్స్ చాలెంజ్’ పేరుతో ఒక వీడియో చేసారు.ఈ వీడియోలో సితార, ఆద్యాలు బొమ్మలకు కలర్స్‌ ఫిల్ చేయటంలో ఒకరితో ఒకరు పోటి పడ్డారు.

ఈ వీడియోని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి మహేష్ బాబు విష్ చేయడంతో ఒక్కసారిగా ఆ వీడియోని ఎబ్భై వేల మంది చూసేసారు.ఇప్పడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతూ వైరల్ అవుతుంది.