గౌతమ్ నంద మూవీ రివ్యూ

చిత్రం : గౌతమ్ నంద
బ్యానర్ : శ్రీ బాలాజీ సినీ మీడియా
దర్శకత్వం : సంపత్ నంది
నిర్మాత : జే.పుల్లారావు
సంగీతం : తమన్
విడుదల తేది : జులై 28\, 2017
నటీనటులు : గోపీచంద్, హన్సిక, కాథరిన్ త్రేసా, ముకేష్ రుషి తదితరులు

 Goutham Nanda Movie Review-TeluguStop.com

యాక్షన్ స్టార్ గోపీచంద్ సినిమాల ఫలితంతో సంబంధం లేకుండా, తనకున్న ఇమేజ్ చట్రంలోనే మాస్ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.ట్రెండ్ మారిన దగ్గరినుండి గోపీచంద్ కి లభించిన ఒకే ఒక్క విజయం లౌక్యం.కాని ఆ సినిమా తరువాత కూడా మళ్ళీ డిలాపడ్డాడు ఈ మాస్ హీరో.

మరోవైపు మాస్ సినిమాలకు పెట్టింది పేరు సంపత్ నంది.మరి ఇద్దరు కలిసి జపించిన మాస్ మంత్రం “గౌతమ్ నంద” ఎలా ఉందొ చూడండి.

కథలోకి వెళితే :

ఫోర్బ్స్ టాప్ 50 ధనువంతుల్లో ఒకడైన ఓ బడా బాబు కొడుకు (గౌతమ్).డబ్బులో మునిగి తెలుతుంటాడు.

కంపెనీలో కీలక బాధ్యతలు తీసుకునే ముందు ప్రపంచాన్ని చుట్టి వద్దామనుకున్నా, గౌతమ్, ఓ సంఘటన తరువాత డబ్బుకి మించిన భావోద్వేగాలు, జీవితం కావాలనుకుంటాడు

కథలో మరోవైపు నంద (గోపీచంద్) బోరబండాలోని ఓ నిరుపేద మరియు నిరుద్యోగి.గౌతమ్ కి డబ్బు లేని భావోద్వేగాలు కావాలి, నందకి కష్టాలు లేని జీవితం, డబ్బు కావాలి.

దాంతో ఈ ఇద్దరు ఒకరి స్థానంలో మరొకరు ఓ 30 రోజులు ఉండాలని డిసైడ్ చేసుకుంటారు.ఆ తరువాత కథలో జరిగే మార్పులు ఏమిటో తెర మీదే చూడండి.

నటీనటుల నటన :

గోపీచంద్ హీరోగా కెరీర్ మొదలుపెట్టిన తరువాత తొలిసారి అనుకుంటా, లుక్ మార్చేశాడు.పెద్ద గడ్డంతో గోపి లుక్ బాగుంది.

ఇంట్రోడక్షన్ సాంగ్ లో గోపి లుక్స్ అదిరిపోయాయి.ఇక నటనపరంగా కొత్త గోపీచంద్ ని చూడలేదు కాని, అందుబాటులో ఎమోషన్స్ ని ఎప్పటిలాగే బాగా పండించాడు.

రెండు భిన్న పాత్రలో గోపి నటన ఆకట్టుకుంటుంది.హన్సిక అందంగా ఉంది.

తనకి డబ్బింగ్ చెప్పిన గొంతు అస్సలు బాలేదు.దాంతో హన్సికకి ఉన్న కొన్ని మంచి సీన్లు కూడా తేలిపోయాయి.

కాథరిన్ చాలా గ్లామరస్ గా ఉంది.కాథరిన్ అందాలు తప్పకుండా మాస్ ప్రేక్షకులని అలరిస్తాయి.

అందులో ఎలాంటి సందేహం లేదు.పెర్ఫార్మెన్స్ పరంగా ఇద్దరు హీరోయిన్లకి పెద్ద స్కోప్ లేదు కాబట్టి, గ్లామర్ పరంగా కాథరిన్ కి ఎక్కువ మార్కులు పడతాయి.

ఇక విలన్ గ్యాంగ్ షరామామూలే.అరవ గొంతులు, ఇంటేన్సిటి లేని విలనిజం.

బోరింగ్.బిత్తిరి సత్తి కామియో ఓ చిన్న హైలెట్.

టెక్నికల్ టీం :

పాటలు బాగానే ఉన్నాయి ఆడియో పరంగా.జిందగీ నా మైల్ దోబారా మరియు బోలె రామ్ పాటలు స్క్రీన్ మీద అదిరిపోతాయి.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రఫ్ ఆడించాడు తమన్.సినిమాటోగ్రాఫి చాలా స్టయిలిష్ గా, కలర్ ఫుల్ గా ఉంది.

లావిష్ లోకేషన్లు, కలర్ ఫుల్ గ్రేడింగ్ అండ్ లైటింగ్, నిజంగా స్టన్నింగ్ విజువల్స్ అందించారు.రేయింగ్ ఫైట్, రెండు పాటలు విజువల్స్ కోసం రిపీట్ చేయొచ్చు.

ఎడిటింగ్ డిపార్ట్మెంట్ సినిమాని సరిగా క్యారి చేయలేదు.నిజానికైతే ఈ టేకింగ్ కి ఎడిటింగ్ వారు చేసే పని పెద్దగా ఏమి ఉండదు.

సినిమా అవసరానికి మించి పెద్దగా ఉంది.నిర్మాణ విలువలు ఇటివల వచ్చిన సినిమాల్లోకి బెస్ట్.డబ్బు బాగా ఖర్చు పెట్టారు అనాలో, విజువల్స్ కోసమే ఖర్చుపెట్టారు అనాలో.

విశ్లేషణ :

ఓక పాత్ర స్థానంలోకి మరో పాత్ర వెళ్ళడం అనేది కొత్త పాయింట్ కాదు.ఎప్పుడో మహేష్ బాబు బాలనటుడిగా ఉన్నప్పుడే చూసాం.కాని దీనికి డబ్బుతో లింక్ చేసాడు సంపత్ నంది.పాయింట్ ఆసక్తికరంగా ఉన్నా, టేకింగ్ మాత్రం పాత చింతకాయ పచ్చడే.అందుకే రెగ్యులర్ సినిమా ప్రేక్షకుడికి అంతగా ఆసక్తిగా అనిపించకపోవచ్చు.

అంతటి సినిమా పరిజ్ఞానం మనకెందుకు అనుకునే మాస్ ఆడియెన్స్ కి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు.కావాల్సినంత గ్లామర్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, అదిరిపోయే విజువల్స్ ఉన్నాయి .అంటే భోజనం లాంటి సినిమా.కొన్ని ఎమోషన్స్ బలవంతం అనిపిస్తాయి, కొన్ని సన్నివేశాలు సిల్లిగా అనిపిస్తాయి.

పాయింట్ కి తగ్గ కళాత్మకత ఉండదు కాని కమర్శియాలిటి ఉంటుంది.అలాంటి టేకింగ్ ని ఇష్టపడేవారు ఓసారి చూడవచ్చు.

ప్లస్ పాయింట్స్ :

* విజువల్స్
* గ్లామర్
* గోపీచంద్ లుక్స్
* తమన్ నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్ :

* ఆసక్తికరంగా లేని ట్విస్ట్స్
* పూర్తిగా తెలిసిన స్క్రీన్ ప్లే
* అనవసరపు నిడివి
* పురాతన టేకింగ్

చివరగా : మాస్ ప్రాడక్ట్

తెలుగు స్టాప్ రేటింగ్ :2.75/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube